తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -మే 10, సోమవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.37

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu May 10 Monday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.17

రాహుకాలం: ఉ.07.30 నుంచి 09.00 వరకు

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu May 10 Monday 2021-తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -మే 10, సోమవారం, 2021-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమృత ఘడియలు: మ.04.00 నుంచి 06.00 వరకు

దుర్ముహూర్తం: ఉ.12.24 నుంచి 01.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Daily Horoscope, Jathakam, May 10 Monday 2021, Telugu Daily Astrology Rasi Phalalu, పంచాంగం, రాశి ఫలాలు-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నా.ఖర్చు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ముఖ్యమైన విషయాలలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు అవగాహన ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.

కొన్ని ప్రయాణాల వల్ల మీకు అనుకూలంగా ఉంటుంది.జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా గడుపుతారు.

వృషభం:

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.చాలా రోజుల నుండి వాయిదా పడిన పనులు ఈరోజు పూర్తి చేస్తారు.దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.స్థల నిర్ణయాల గురించి తోబుట్టువులతో మాట్లాడుతారు.ఈరోజు అనుకూలంగా ఉంది.మీ జీవిత భాగస్వామి సంతోషంగా ఉంటారు.

మిథునం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో లాభాలుంటాయి.మీ వ్యక్తిత్వం పట్ల మీకు మంచి పేరు దక్కుతుంది.తీరికలేని సమయంతో గడుపుతారు.వ్యాపార పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.మీ జీవితభాగస్వామితో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

కర్కాటకం:

ఈరోజు మీకు ఇతరులతో కొన్ని ఇబ్బందులెదురవుతాయి.కొన్ని ముఖ్యమైన విషయాలలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయడం మంచిది.

మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేస్తారు.

సింహం:

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.గతంలో మీ దగ్గర తీసుకున్న సొమ్మును తిరిగి ఇవ్వడం ఆలస్యం చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.సంతానం పట్ల ఆలోచన చేయాలి.

కన్య:

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.దీనివల్ల నిరుత్సాహ చెందుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.

ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.సమయాన్ని వృధా చేయకూడదు.

తులా:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.

మీ స్నేహితులతో కలసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీ జీవితభాగస్వామితో సంతోషంగా గడపాలి.

వృశ్చికం:

ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల పనులు ఆగిపోతాయి.దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.ఆర్థికంగా పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.వ్యాపారస్తులు పనులు వాయిదా వేస్తారు.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

ధనస్సు:

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయడం మంచిది.

మకరం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.

ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా పడతాయి.ఈరోజు జాగ్రత్తలు అవసరం.

కుంభం:

ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.దూరప్రాంతాపు బంధువుల నుండి శుభవార్త వింటారు.మీ కుటుంబంలో ఒకరి ఆరోగ్య సమస్య ఈరోజు కుదుటపడుతుంది.

వ్యాపారస్తులకు లాభాలు ఉంటాయి.మీ పిల్లలతో సంతోషంగా గడుపుతారు.

మీనం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.చాలా రోజుల నుండి తీరిక లేని సమయం గడపడం వల్ల ఈ రోజు విశ్రాంతి దొరుకుతుంది.అనవసరమైన విషయాల గురించి తొందరపడకండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అవగాహన వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.

#Daily Horoscope #Jathakam #TeluguDaily

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU