తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 9, మంగళవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.16

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu March 9 Tuesday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.04

రాహుకాలం: మ.03.00 నుంచి 04.30 వరకు

అమృత ఘడియలు: ఉ.10.30 నుంచి 11.30 వరకు

దుర్ముహూర్తం: ఉ.08.24 నుంచి 09.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈ రోజు మీరు కొన్ని పనులను త్వరగా పూర్తి చేస్తారు.కొన్ని లాభాలు అందుతాయి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.

ఇతరులతో మాట్లాడే ముందు తొందర పడకూడదు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

వృషభం:

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.దూర ప్రయాణాలు చేయడం వల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవాలి.వ్యాపారస్థులకు పెట్టుబడి విషయంలో కొన్ని లాభాలు ఉన్నాయి.

మిథునం:

ఈరోజు మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

కర్కాటకం:

ఈరోజు మీకు ధనలాభం ఉంటుంది.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆలోచించాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

సింహం:

ఈరోజు మీరు ఆర్థికపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.తీరికలేని సమయంతో గడపడం వల్ల విశ్రాంతి లేకుండా పోతుంది.

కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవడం మంచిది.మీరు పనిచేసే చోట కాస్త ఒత్తిడి ఎక్కువ అవుతుంది.

కన్య:

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.భవిష్యత్తులో దీని వల్ల కొన్ని లాభాలు ఎదురవుతాయి.కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.దూరప్రాంత బంధువుల నుండి కొన్ని ఆహ్వానాలు వస్తాయి.వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.

తులా:

ఈరోజు మీరు మీ స్నేహితులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.దీనివల్ల సంతోషంగా గడుపుతారు.కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు.

నూతన పరిచయాలు ఏర్పడతాయి.కొన్ని ప్రాంతాల్లో కాలక్షేపం చేస్తారు.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి సహాయం అందుతుంది.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికపరంగా లాభాలు పొందుతారు.ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేశారు.ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది.

కొన్ని ప్రయాణాలు చేస్తారు.బంధు మిత్రులతో కలిసి సంతోషంగా ఉంటారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

ధనస్సు:

ఈరోజు మీరు ధనాన్ని పొదుపు చేయడం మంచిది.లేదా ఇబ్బందులెదురవుతాయి.ఇతరుల నుంచి ‌ మీ సొమ్ము తిరిగి రావడం కాస్త ఆలస్యం అవుతుంది.

తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.కుటుంబ సభ్యులతో కలసి సమయాన్ని గడపాలి.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి

మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలను ఎదుర్కొంటారు.కొన్ని విలువైన వస్తువులను కోల్పోతారు.దీనివల్ల నిరుత్సాహంగా ఉంటారు.కుటుంబ సభ్యులతో వాదనలు ఎదురవుతాయి.దీనివల్ల మరింత మనశ్శాంతి కోల్పోతారు.ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

కుంభం:

ఈరోజు మీకు ఆర్థిక లాభాలు ఉన్నాయి.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీ స్నేహితులను కలుస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి కాస్త ఆలోచనలు చేయాలి.

మీనం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరంగా ఇతరులతో వాదనకు దిగుతారు.ఈ రోజు మీ వ్యక్తిత్వాన్ని మీరే కోల్పోయేలా చేసుకుంటారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.

#TeluguDaily #Daily Horoscope #Jathakam #March9

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

TELUGU BHAKTHI