తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 6, శనివారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.18

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu March 6 Saturday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.02

రాహుకాలం: ఉ.09.00 నుంచి 10.30 వరకు

అమృత ఘడియలు: ఉ.10.40 నుంచి 11.40 వరకు

దుర్ముహూర్తం: ఉ.06.00 నుంచి 07.36 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.కొన్ని విలువైన వస్తువులు కొంటారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.

భవిష్యత్తు గురించి కొన్ని ప్లాన్ లు చేస్తుంటారు.కొన్ని విషయాల పట్ల సొంత నిర్ణయాలు తీసుకోవాలి.ఏదైనా పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

వృషభం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.తొందరపడి మీ సొమ్ము ను ఇతరులకు ఇవ్వకండి.కొన్ని విషయాల పట్ల తల్లి దండ్రుల నిర్ణయాలు తీసుకోవాలి.

వ్యాపార పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

మిథునం:

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలను ఎదుర్కొంటారు.మీ ఇంట్లో విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.దీనివల్ల చాలా బాధపడతారు.ఈ సమయంలో కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవాలి.మీరు పనిచేసే చోట కాస్త విశ్రాంతి దొరుకుతుంది.

కర్కాటకం:

ఈరోజు మీకు ఇతరుల నుండి సహాయం అందుతుంది.దీనివల్ల కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి కాస్త ఆలోచించే సమయాన్ని తీసుకోవాలి.

కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

సింహం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.దీనివల్ల కొన్ని లాభాలు ఉంటాయి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.నూతన పరిచయాలు ఏర్పడతాయి.కొన్ని ముఖ్య విషయాల గురించి తెలుసుకుంటారు.కాస్త సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

కన్య:

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఏ విషయంలోనైనా తొందర పడకూడదు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.ఈరోజు మీరు ఊహించుకున్నంత బాగోలేదు.తొందరపడి ఎటువంటి పనులలో గాని పాల్గొనకుండా ఉండటం మంచిది.

తులా:

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.కొన్ని విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.ఇతరులకు మీరు ఇచ్చిన సొమ్ము తిరిగి వస్తుంది.

కొన్ని ప్రయాణాలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ఉత్సాహపరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.

వృశ్చికం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొంటారు.మీ ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది.దూరప్రాంత బంధువులు మీ ఇంటికి వచ్చే అవకాశం ఉంది.దీనివల్ల సంతోషంగా ఉంటారు.కొన్ని పనులు మీరే వాయిదా వేసుకుంటారు.

ధనస్సు:

ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.దీనివల్ల విశ్రాంతి లేకుండా పోతుంది.సమయాన్ని జాగ్రత్తగా పాటించాలి.వ్యాపారస్తులు నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించాలి.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.

మకరం:

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.కొన్ని పనులు చేసే ముందు అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.దీనివల్ల కొన్ని విషయాలు తెలుస్తాయి.ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

కుంభం:

ఈరోజు మీకు కొన్ని పనులు సక్రమంగా సాగుతాయి.కొన్ని ప్రయాణాలు చేస్తారు.ధన లాభం పొందుతారు.

కొన్ని వస్తువులను కొంటారు.పిల్లల విషయంలో కొన్ని ఆలోచనలు చేస్తారు.

వ్యాపారస్తులు ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు.ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి.

మీనం:

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేయడానికి ఆసక్తి చూపుతారు.కానీ అవి అడ్డంకుల వల్ల మరలా వాయిదా పడే అవకాశం ఉంది.దీనివల్ల కాస్త నిరుత్సాహ పడతారు.కొన్ని కార్యక్రమాల నుండి ఆహ్వానం అందుతుంది.వ్యాపారస్తులు తమ పనులను వాయిదా వేసుకోకండి.

#Jathakam #TeluguDaily #March6 #Daily Horoscope

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

TELUGU BHAKTHI