తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 4, గురువారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం:ఉదయం 06.18&

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu March 4 Thursday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం:సాయంత్రం 06.02&

రాహుకాలం: ఉ.01.30 నుంచి 03.00 వరకు&

అమృత ఘడియలు: ఉ.07.30 నుంచి 09.00 వరకు&

దుర్ముహూర్తం: ఉ.10.00 నుంచి 10.48 వరకు&

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీకు కొన్ని పనులు సక్రమంగా సాగుతాయి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

పాత స్నేహితులను కలుస్తారు.వారితో కాస్త సమయాన్ని కేటాయిస్తారు.ఈ రోజంతా అనుకూలంగా ఉంది.

వృషభం:

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.ఆరోగ్య సమస్య ఈరోజు కుదుటపడుతుంది.

మీ స్నేహితులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

మిథునం:

ఈరోజు మీరు ఆర్థికపరంగా కొన్ని లాభాలు పొందుతారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదు.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా పడతాయి.

కర్కాటకం:

ఈరోజు మీరు ఆర్థికపరంగా పొదుపు చేయడం మంచిది.అనవసరమైన వస్తువులను కొంటారు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.

ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.అనవసరంగా వాదనలకు దిగడం సరైనది కాదు.

సింహం:

ఈరోజు మీకు కొన్ని పనులు వాయిదా పడతాయి.దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.మీ తోబుట్టువులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపారస్తులు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది.

కన్య:

ఈరోజు మీరు ఆర్థిక పరంగా నష్టాలు ఎదుర్కొంటారు.దీనివల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.మీ ఇంట్లో ఒకరి ఆరోగ్య సమస్య మిమ్మల్ని బాధ పెడుతుంది.

పిల్లల భవిష్యత్తు గురించి కాస్త ఆలోచించాలి.మీరు పనిచేసే చోట మీకు ఎక్కువ ఒత్తిడి ఉంటుంది.

తులా:

ఈరోజు మీరు కొన్ని ఉత్సాహపరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.ఈరోజు మీకు కొన్ని లాభాలు ఉన్నాయి.దూరప్రాంతాల బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో పనులు త్వరగా పూర్తవుతాయి.

వృశ్చికం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు అందుతాయి.మీరు ఇతరులకు సహాయం చేస్తారు.మీ వ్యక్తిత్వం వల్ల మంచి గౌరవం దక్కుతుంది.

కొన్ని దైవ దర్శనాలు చేస్తారు.అనుకోకుండా ఇంటికి వచ్చిన అతిథి వల్ల సంతోషంగా గడుపుతారు.ఈరోజు మనశ్శాంతి ఉంటుంది.

ధనస్సు:

ఈరోజు మీరు ఆర్థిక పరంగా లాభాలు పొందుతారు.ఇంటికి కావాల్సిన ముఖ్యమైన వస్తువులు కొంటారు.ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది.

పనులతో హడావిడిగా ఉంటారు.వ్యాపారస్తులు కొన్ని ముఖ్యమైన పనులను తర్వాత రోజుకు వాయిదా చేస్తారు.

మకరం:

ఈరోజు మీకు ఆర్థికపరంగా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి‌.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.కొన్ని దూర ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.తొందర పడటం వల్ల మీ వ్యక్తిత్వాన్ని కోల్పోయే అవకాశం ఉంది.

కుంభం:

ఈరోజు మీరు తీరికలేని సమయం గడపడం వల్ల విశ్రాంతి పొందుతారు.కొన్ని దైవ దర్శనం వంటి ప్రయాణాలు చేస్తారు.దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.

కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీ చిన్ననాటి స్నేహితులను కలుస్తారు.వారితో సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

మీనం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం వలన తర్వాత లాభాలుంటాయి.కొన్ని వస్తువులను ఎక్కువగా కొనుగోలు చేయకపోవడం మంచిది.పిల్లల విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.

కుటుంబ సభ్యుల తో కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

#March4 #TeluguDaily #Daily Horoscope #Jathakam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

TELUGU BHAKTHI