తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 30, మంగళవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.04

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu March 30 Tuesday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.04

రాహుకాలం: మ.03.00 నుంచి 04.30 వరకు

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu March 30 Tuesday 2021-తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి 30, మంగళవారం, 2021-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమృత ఘడియలు: ఉ.10.30 నుంచి 12.00 వరకు

దుర్ముహూర్తం: ఉ.08.24 నుంచి 09.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు పొందుతారు.పని చేసే పనులు త్వరగా పూర్తి చేసే అవకాశం ఉంది.

వృషభం:

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.ఇంట్లో ఒకరి ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతుంది.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

మిథునం:

ఈరోజు మీకు కొన్ని పనులు వాయిదా పడే అవకాశం ఉంది.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.కొన్ని దైవదర్శనం వంటి ప్రయాణాలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.

కర్కాటకం:

ఈరోజు మీరు కొన్ని విషయాలలో తొందరపడటం వల్ల మీ వ్యక్తిత్వం కోల్పోతారు.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా పడతాయి.

సింహం:

ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.దీనివల్ల అనుకూలంగా ఉంటుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్థులకు పెట్టుబడి విషయంలో నష్టాలు ఉంటాయి.

కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.

పిల్లల భవిష్యత్తు గురించి కాస్త ఆలోచించాలి.దూర ప్రయాణాలు చేయకూడదు.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

తులా:

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలను ఎదుర్కొంటారు.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.తొందరపడి వ్యక్తిత్వాన్ని కోల్పోతారు.

ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు పొందుతారు.కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇంట్లో పండగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా చేస్తారు.ఈరోజు సంతోషంగా గడుపుతారు.

ధనస్సు:

ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది.ఆర్థిక సహాయం పొందుతారు.మీ కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చించాలి.

దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఈ పాత స్నేహితులతో కలిసి సంతోషంగా గడుపుతారు.పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వాహన కొనుగోలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

కుంభం:

ఈరోజు మీకు కొన్ని పనులు వాయిదా పడతాయి.తీరిక లేని సమయంతో గడుపుతారు.దీనివల్ల కాస్త నిరుత్సాహ పడతారు.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.వ్యాపారస్తులు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

మీనం:

ఈరోజు మీకు ఆర్థిక నష్టాలు ఉన్నాయి.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.దీనివల్ల చాలా బాధ పడతారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాలు అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

#TeluguDaily #Jathakam #Daily Horoscope #March30

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

DEVOTIONAL