తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 15, సోమవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.10

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu March 15 Monday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.04

రాహుకాలం: మ.7.30 నుంచి 09.00 వరకు

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu March 15 Monday 2021-తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి 15, సోమవారం, 2021-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమృత ఘడియలు: ఉ.06.00 నుంచి 07.30 వరకు

దుర్ముహూర్తం: ఉ.12.24 నుంచి 01.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.ఇతరుల నుంచి మీ సొమ్ము తిరిగి వస్తుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.వ్యాపారస్తుల కు అనుకూలంగా ఉంది.

వృషభం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా మాట్లాడాలి.తోబుట్టువుల మధ్య వాదనలకు దిగకూడదు.సమయాన్ని వృథా చేయకూడదు.

మిథునం:

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

కర్కాటకం:

ఈ రోజు మీరు ఆర్థిక పరంగా ఎక్కువ నష్టాలు ఎదుర్కొంటారు.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావటం ఆలస్యం అవుతుంది.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువవుతుంది.

సింహం:

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవాలి.

కన్య:

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని లాభాలు ఉండడంవల్ల ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇతరుల నుండి సహాయం అందే అవకాశం ఉంది.

తులా:

ఈరోజు మీకు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి.పిల్లల భవిష్యత్తు గురించి కొన్ని ఆలోచనలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

వృశ్చికం:

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.మీ కుటుంబ సభ్యులకు ఒకరి ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఆలోచించాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

ధనస్సు:

ఈరోజు మీకు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఉన్నాయి.అవసరమైన వస్తువులు కొనుగోలు చేయకపోవడం మంచిది.కొన్ని ప్రయాణాలు చేస్తారు.దూరప్రాంతాల బంధువుల నుండి కొన్ని సమాచారాలు వస్తాయి.కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాలు వంటివి చేస్తారు.

మకరం:

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.దీనివల్ల మనశ్శాంతి కలుగుతుంది.మీ పాత స్నేహితులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.

దీనివల్ల సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు ముఖ్యమైన పనులు త్వరగా పూర్తవుతాయి.

కుంభం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.తీరిక లేని సమయంతో గడుపుతారు.భవిష్యత్తు గురించి కొన్ని ఆలోచనలు చేస్తారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఇంట్లో కుటుంబ సభ్యులతో పండగ వాతావరణం ఉంటుంది.

మీనం:

ఈరోజు మీరు తీరికలేని సమయం తో గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.కొన్ని దైవదర్శనం ప్రయాణాలు చేస్తారు.

కొన్ని ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా పడతాయి.

#Jathakam #Daily Horoscope #TeluguDaily #March15

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU