ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం:ఉదయం 06.18
సూర్యాస్తమయం:సాయంత్రం06.02
రాహుకాలం: ఉ.07.30 నుంచి 09.00 వరకు
అమృత ఘడియలు: ఉ.09.00 నుంచి 10.30 వరకు
దుర్ముహూర్తం: ఉ.12.24 నుంచి 01.12 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదురవుతాయి.అనవసరమైన ఖర్చులు చేయడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో కొన్ని పనులు వాయిదా పడతాయి.
వృషభం:
ఈరోజు మీకు కొన్ని పనులు సక్రమంగా సాగే అవకాశం ఉంది.ఇతరులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీ కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలని.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.
మిథునం:
ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని పనులు విశ్రాంతి లేకుండా చేస్తారు.దీనివల్ల కాస్త మనశ్శాంతి కోల్పోతారు.కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి.
కర్కాటకం:
ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.
కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా పడుతాయి.
సింహం:
ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందే అవకాశం ఉంది.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి.దీని వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.మీ పాత స్నేహితులను కలుస్తారు.ఈ రోజంతా సంతోషంగా ఉంటుంది.
కన్య:
ఈరోజు మీకు కొన్ని నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది.ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.ఆరోగ్యంపట్ల జాగ్రత్త తీసుకోవాలి.ఇతరులతో అనవసరంగా వాదనలకు దిగకండి.వ్యాపారస్తులకు ఇబ్బందులు ఎదురవుతాయి.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.
తులా:
ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు ఉన్నాయి.తీరికలేని సమయంతో గడుపుతారు.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.వ్యాపారస్తులకు నష్టాలు ఎదురవుతాయి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.
వృశ్చికం:
ఈరోజు మీరు చాలా రోజుల నుండి వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.దీంతో మనశ్శాంతి కలుగుతుంది.కానీ దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.
ధనస్సు:
ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.కొన్ని విలువైన వస్తువులు కొంటారు.తోబుట్టువులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.
కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి మాట్లాడాలి.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.
మకరం:
ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలను ఎదుర్కొంటారు.అనవసరమైన వస్తువులు కొంటారు.తీరికలేని సమయంతో గడుపుతారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి కాస్త ఒత్తిడి ఎక్కువవుతోంది.
కుంభం:
ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు పొందడం వల్ల వాహన కొనుగోలు చేసే అవకాశం ఉంది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.కొన్ని దైవ దర్శనాలు చేస్తారు.
వ్యాపారస్తులకు కొన్ని పనులు వాయిదా పడతాయి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.
మీనం:
ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుతాయి.
DEVOTIONAL