తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 9, బుధవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం:ఉదయం 05.37

సూర్యాస్తమయం:సాయంత్రం 06.17

రాహుకాలం:మ.12.00 నుంచి 01.30 వరకు

అమృత ఘడియలు:చతుర్దశి, రోహిణి సా.2.00ల 4.00 వరకు

దుర్ముహూర్తం:ఉ.11.36 నుంచి 12.24 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేసే అవకాశం ఉంది.ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu June 9 Wednesday 2021-TeluguStop.com

ఈరోజు మీ పాత స్నేహితులు కలుస్తారు.ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

వృషభం:

ఈరోజు మీరు మీ వ్యక్తిత్వం పట్ల గౌరవాన్ని కోల్పోతారు.కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.తోబుట్టువులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.

మిథునం:

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వడం లో ఆలస్యం చేస్తారు.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయాన్ని పొందుతారు.

కర్కాటకం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.మీ వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా చూసుకోవాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

సింహం:

ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.దీనివల్ల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.కొన్ని ప్రయాణాలు చేస్తారు.కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీరు పనిచేసే చోట లాభాలు ఉన్నాయి.

కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.అనవసరమైన వస్తువులను ఎక్కువగా కొనుగోలు చేయకండి.వీలైనంత వరకు కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.ఈరోజు మీరు కార్యక్రమాలలో పాల్గొంటారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంది.

తులా:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.ఈరోజు కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu June 9 Wednesday 2021-తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూన్ 9, బుధవారం, 2021-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.మానసికంగా ఉత్సాహంగా ఉండటానికి కాస్త సమయాన్ని గడపవలసి ఉంటుంది.

వృశ్చికం:

ఈరోజు మీ కుటుంబ సభ్యులతో కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు మీకు బాగా సహాయపడతాయి.ఈరోజు మీరు కొత్త పరిచయాలు పెంచుకుంటారు.త్వరలో ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది.

ధనస్సు:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.సమయాన్ని వృథా చేయకూడదు.

అనుకోకుండా స్నేహితులు కలుస్తారు.కొన్ని వ్యాపార విషయాల గురించి చర్చలు చేస్తారు.ఈరోజు మీకు సహాయం అందుతుంది.

మకరం:

ఈరోజు మీరు ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటారు.దీని వల్ల చింత చెందాల్సిన పనిలేదు.ఈరోజు మీరు అనుభవం ఉన్న వ్యక్తులతో కాస్త సమయాన్ని గడుపుతారు.

దీనివల్ల మీ మనసు ఉల్లాసంగా ఉంటుంది.మీరు వ్యాపారం మొదలు పెట్టినట్లయితే బాగా ఎక్కువగా ఉన్నాయి.

కుంభం:

ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.తోబుట్టువులతో గొడవలకు దిగకండి.భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

మీనం:

ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరులకు మీ సొమ్మును అప్పుగా ఇవ్వకూడదు.కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

#Daily Horoscope #June9 #Jathakam #TeluguDaily

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

DEVOTIONAL