తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -జూన్ 5, శనివారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.37

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu June 5 Saturday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.17

రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu June 5 Saturday 2021-తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -జూన్ 5, శనివారం, 2021-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమృత ఘడియలు: ఉ.06.00 నుంచి 07.30 వరకు

దుర్ముహూర్తం: ఉ.08.24 నుంచి 09.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఏ పనులు ప్రారంభించిన సకాలంలో పూర్తవుతాయి.ఈరోజు కొన్ని సంఘటనలు జరిగే అవకాశం ఉంది.

మీ వ్యక్తిత్వం పట్ల గౌరవం అందుతుంది.ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది.ఈ రోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.

వృషభం:

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.కొన్ని ముఖ్యమైన పనులలో ఫలితాలు అందుతాయి.కొన్ని వాదనలు ఈరోజు తీరిపోతాయి.

ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.ఆర్థికపరంగా కాస్త ఖర్చులు ఉంటాయి.వ్యాపారస్తులు లాభాలు పొందుతారు.

మిథునం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

శత్రువులకు దూరంగా ఉండాలి.వ్యాపారస్తులు అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటకం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఈరోజు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

అనుకోకుండా కొన్ని సమస్యలు ఎదురవుతాయి.ఈరోజు జాగ్రత్తగా పరిష్కరించుకోవాలి.

సింహం:

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆరోగ్యం పట్ల ఈరోజు శ్రద్ధ తీసుకోవాలి.భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువగా నష్టపోతారు.ఏ పని మొదలు పెట్టినా ఆలస్యంగా పూర్తవుతుంది.ఇంట్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

కొన్ని వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.ఈరోజు మరింత ధైర్యంగా ఉండాలి.

తులా:

ఈరోజు మీరు ఆనందంగా గడుపుతారు.ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.

కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఇతరుల నుండి సహాయం అందుతుంది.ఈరోజు మీ పాత స్నేహితులను కలుస్తారు.

వృశ్చికం:

ఈరోజు మీరు కొన్ని లాభాలు పొందుతారు.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాల్లో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో ఆలోచించి మాట్లాడాలి.ఈరోజు సంతోషంగా ఉంటారు.

ధనస్సు:

ఈరోజు మీ వ్యక్తిత్వం పట్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.అనవసరంగా వాదనలకు దిగుతారు.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో నష్టాలు ఉంటాయి.

మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.అనుకోకుండా మీ స్నేహితులు కలుస్తారు.అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.

కుంభం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.దీనివల్ల నిరుత్సాహం చెందుతారు.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.ఇతరులు మీ సొమ్ము తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.

మీనం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.అనుకున్న పనులను త్వరగా పూర్తి అవుతాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.సంతానం పట్ల ఆలోచనలు చేయాలి.ఈరోజు మీరు సంతోషంగా గడుపుతారు.

#Daily Horoscope #June Saturday #Jathakam #TeluguDaily

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU