తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 13, ఆదివారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.33

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu June 13 Sunday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.19

రాహుకాలం: మ.04.30 నుంచి 06.00 వరకు

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu June 13 Sunday 2021-తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూన్ 13, ఆదివారం, 2021-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమృత ఘడియలు: ఉ.06.30 నుంచి 08.50 వరకు

దుర్ముహూర్తం: ఉ.48.25 నుంచి 05.13 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈ రోజు మీరు కొన్ని లాభాలు అందుకుంటారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడుతారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.కొన్ని సొంత నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి.

వృషభం:

ఈరోజు మీరు కొన్ని ప్రయోజనాలు పొందుతారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

మిథునం:

ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.ఆర్థికంగా ఇతరులకు మీ సొమ్మును అప్పుగా ఇవ్వకూడదు.కుటుంబ సభ్యులతో కొన్ని సమస్యల గురించి మాట్లాడుతారు.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

కర్కాటకం:

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి మాట్లాడకూడదు.కొన్ని ఇబ్బందుల వల్ల మనశ్శాంతి కోల్పోతారు.భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.ఈరోజు సంతోషంగా గడుపుతారు.

సింహం:

ఈరోజు మీరు కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వడం లో ఆలస్యం చేస్తారు.మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

కన్య:

ఈరోజు మీరు అనుకూలంగా ఉంటారు.ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఈ రోజు మీరు ఇతరుల సహాయం పొందుతారు.మీ ఇంటికి బంధువులు వస్తారు.

తులా:

ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం బట్టి భవిష్యత్తు ఉంటుంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

సంతానం పట్ల ఆలోచన చేస్తారు.మీరు పని చేసే చోట పనులు త్వరగా పూర్తి అవుతాయి.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆలోచించాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.

ధనస్సు:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.అనవసరమైన విషయాలలో గొడవలకు దిగకండి.కొన్ని ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.

కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.ఈరోజు సంతోషంగా గడుపుతారు.

మకరం:

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచనలు చేయాలి.అనుకోకుండా ఇతరులు మీకు సహాయం చేస్తారు.మీరు పనిచేసే చోట పనులు త్వరగా పూర్తి అవుతాయి.

కుంభం:

ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం బట్టి భవిష్యత్తు ఉంటుంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.తోబుట్టువులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు పొందుతారు.

మీనం:

ఈరోజు మీరు ఇతరులతో కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.

సొంత నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది.పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.

#Daily Horoscope #Jathakam #TeluguDaily

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU