తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూలై 26, సోమవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 5.340

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu July 26 Monday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 6.33

రాహుకాలం: ఉ.7.30 ల9.00

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu July 26 Monday 2021-తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూలై 26, సోమవారం, 2021-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమృత ఘడియలు: ఉ.9.00ల10.30,సా.4.00ల6.00

దుర్ముహూర్తం: ఉ.12.24ల1.12,ప.2.46ల3.34

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈ రోజు మీరు కొన్ని కష్టాల నుండి బయటపడతారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నా పనులు కూడా పూర్తి చేస్తారు.

కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు ఈరోజు అనుకూలత ఎక్కువగా ఉంది.

వృషభం:

ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు చేస్తారు.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.మీ వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా జాగ్రత్తగా తీసుకోవాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇతరుల సహాయం అందుతుంది.

మిథునం:

రోజు మీరు ఏ విషయంలో కూడా తొందర పడకూడదు.దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.తోబుట్టువులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.

కర్కాటకం:

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు.ఇతరులతో వాదనలకు దిగకండి.

అనవసరమైన విషయాల గురించి చర్చలు ఎక్కువగా చేయకండి.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

సింహం:

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా మీ స్నేహితులను కలుస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

ఓ శుభవార్త వింటారు.దీని వల్ల మరింత సంతోషంగా ఉంటారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

కన్య:

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.కొన్ని కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనే ముందు ఆలోచిస్తారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.శత్రువులకు దూరంగా ఉండటం చాలా మంచిది.

తులా:

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆర్థికంగా పొదుపు చేయాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.ఇతరులతో వాదనలకు దిగకండి.కొన్ని ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకుంటారు.

వృశ్చికం:

ఈరోజు మీరు ఓ శుభవార్త వింటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోకూడదు.సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.

ధనస్సు:

ఈరోజు మీరు కొన్ని కొత్త పరిచయాలు చేసుకుంటారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.కుటుంబ సభ్యులతో కలసి సమయాన్ని గడపాలి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.దూర ప్రయాణాలు చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట కాస్త ఒత్తిడి ఉంటుంది.

కుంభం:

ఈరోజు మీరు మీ సమయాన్ని వృథా చేయకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి.దీనివల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయాన్ని పొందుతారు.

మీనం:

ఈరోజు మీరు కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.శత్రువులకు దూరంగా ఉంటారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.

ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది

#Daily Horoscope #TeluguDaily #Jathakam #July Monday

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

DEVOTIONAL