తెలుగు రాశి ఫలాలు, పంచాంగం-జనవరి 31 ఆదివారం ,2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం:ఉదయం 06.48

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu January 31 Sunday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం:సాయంత్రం 06.11

రాహుకాలం:మ.04.042నుంచి 06.07 వరకు

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu January 31 Sunday 2021-తెలుగు రాశి ఫలాలు, పంచాంగం-జనవరి 31 ఆదివారం ,2021-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమృత ఘడియలు: ఉ.07.12 నుంచి 08.44 వరకు

దుర్ముహూర్తం: మ.12.29 నుంచి 01.54 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన కార్యక్రమంలో పాల్గొంటారు.కొన్ని శుభ వార్తలు వింటారు.ఆరోగ్య సమస్య ఈ రోజు కుదుట పడుతుంది.

కుటుంబ సభ్యులతో సంతోషం గా గడపడానికి ప్రయత్నించండి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రతగా ఉండాలి.

వృషభం:

ఈ రోజు కొన్ని పనులు సక్రమంగా జరుగుతాయి.ఇతరులకు ఇచ్చిన మీ సొమ్ము తిరిగి  రావటం ఆలస్యం అవుతుంది.వ్యాపారస్తులకు ఈ రోజు అనుకూలంగా వుంది.కుటుంబ సభ్యుల తో కలిసి సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

మిథునం:

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెట్టే ముందు జాగ్రత్తగా ఉండాలి.తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.ఉద్యోగస్తులకు ఒత్తిడి ఉంటుంది.

కర్కాటకం:

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆర్థిక పరంగా నష్టాలు ఉన్నాయి.అవసరమైన వస్తువులు కొనుగోలు చేయకపోవడం మంచిది.

ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా పడతాయి.

సింహం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.వాహన కొనుగోలు చేసే అవకాశం ఉంది.ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

కన్య:

ఈరోజు మీరు ధనాన్ని పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.మీ తల్లిదండ్రులతో కలిసి దైవదర్శనం చేస్తారు.

కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ఈరోజు కొన్ని పనులు సక్రమంగా సాగుతాయి.

తులా:

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలను పొందటం వల్ల కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇంట్లో పండగ వాతావరణం వల్ల సభ్యులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులు కొన్ని పనులు వాయిదా వేయడం మంచిది.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

వృశ్చికం:

ఈరోజు మీకు కొంతవరకు లాభాలు ఉన్నాయి.ఇతరులకు ఇచ్చిన మీ సొమ్ము తిరిగి వస్తుంది.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ముఖ్యమైన విషయాల గురించి మీ తల్లిదండ్రులతో మాట్లాడాలి.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడటం వల్ల సంతోషంగా ఉంటారు.

ధనస్సు:

ఈరోజు మీకు ఎక్కువ లాభాలు ఉన్నాయి.నూతన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.కొన్ని పనులు సక్రమంగా పూర్తవుతాయి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.వ్యాపారస్తులకు ముఖ్యమైన పనులలో అనుకూలంగా వుంది.

మకరం:

ఈరోజు మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీ కుటుంబ సభ్యుల ఒకరి ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.ఈ రోజు మీ పాత స్నేహితులను కలవడం వల్ల సంతోషంగా ఉంటారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

కుంభం:

ఈరోజు మీకు కొన్ని లాభాలు ఉండటం వల్ల అంత మంచే జరుగుతున్న క్రమంలో మీ వస్తువులు కోల్పోయే అవకాశం ఉంటుంది.అనుకోకుండా దూర ప్రాంతం బంధువులను శుభవార్త వింటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.మీరు పని చేసే చోట ప్రశంసలు అందుతాయి.

మీనం:

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.కొన్ని ముఖ్యమైన కార్యక్రమంలో పాల్గొంటారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.మీ స్నేహితుల నుండి ఆర్థికంగా సహాయం అందుతుంది.మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి.

#January31 #Jathakam #TeluguDaily #Daily Horoscope

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU