తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 24 ఆదివారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.39

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu January 24 Sunday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.59

రాహుకాలం: సా.04.30 నుంచి 06.00 వరకు

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu January 24 Sunday 2021-తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి 24 ఆదివారం, 2021-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమృత ఘడియలు: ఉ.07.50 నుంచి 08.20 వరకు

దుర్ముహూర్తం: ఉ.04.26 నుంచి 05.11 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా పడతాయి.

వృషభం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా విజయవంతంగా సాగుతోంది.తీరికలేని సమయం గడపడం వల్ల ఈరోజు విశ్రాంతి దొరుకుతుంది.వ్యాపారస్తులకు పెట్టుబడుల విషయంలో అనుకూలంగా ఉంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

మిథునం:

ఈరోజు మీరు ఆర్థికంగా అనవసరమైన ఖర్చులు చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.కుటుంబ సభ్యుల ఒకరి ఆరోగ్య సమస్య జాగ్రత్త చేసుకోవాలి.మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.ఇతరులతో ఆలోచించి మాట్లాడాలి.

కర్కాటకం:

ఈరోజు మీరు ఆర్థిక పరంగా లాభాలు పొందుతారు.ఇతరులకు ఇచ్చే సొమ్మును అప్పుగా తిరిగి ఇస్తారు.ఆరోగ్య విషయంలో అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు.పాత స్నేహితులు కలవడం వల్ల సంతోషంగా ఉంటారు.

సింహం:

ఈరోజు మీకు ఆర్థికంగా ధన లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.ఈ రోజంతా సంతోషంగా గడుపుతారు.

కన్య:

ఈరోజు మీరు కొన్ని లాభాలు పొందుతారు.తీరిక లేని సమయం గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.ఈరోజు మీరు కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.

తులా:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగదు.కొన్ని ముఖ్యమైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికపరంగా లాభాలు పొందుతారు.ఇతరులకు అప్పులు ఇచ్చే ముందు ఆలోచించాలి.దూర ప్రాంతపు బంధువుల నుండి శుభవార్త వింటారు.

కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

ధనస్సు:

ఈరోజు మీకు అనుకున్న పనులన్నీ పూర్తవుతాయని.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.ఇంట్లో పండగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు ఏ పని మొదలు పెట్టినా విజయవంతంగా సాగుతోంది.

మకరం:

ఈరోజు మీరు కొన్ని దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంది.మీ వ్యక్తిత్వం గురించి పలువురు గొప్పలు చెప్పుకుంటారు.మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి.ఈ రోజంతా సంతోషంగా ఉంటారు.

కుంభం:

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

కుటుంబ సభ్యులతో కొన్ని ఇబ్బందులెదురవుతాయి.ఈరోజు కొన్ని ప్రయాణాలు చేస్తారు.

మీనం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి.ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.వ్యాపారస్తులకు కొన్ని పనులు వాయిదా పడే అవకాశం ఉంది.మీరు పనిచేసే చోట కాస్త ఒత్తిడి ఎక్కువ అవుతుంది.

#January24 #Jathakam #Daily Horoscope #TeluguDaily

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU