తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఫిబ్రవరి 28, ఆదివారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.20

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu February 28 Sunday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం06.00

రాహుకాలం: మ.04.30 నుంచి 06.00 వరకు

అమృత ఘడియలు: ఉ.07.00 నుంచి 11.00 వరకు

దుర్ముహూర్తం: మ.04.25 నుంచి 05.13 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈ రోజు మీరు ఆర్థికంగా లాభాలను పొందుతారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో విజయం ఉంటుంది.మీరు పని చేసే చోట అనుకూలంగా ఉంది.

వృషభం:

ఈ రోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.తొందర పడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.వ్యాపారస్తులకు కొన్ని పనులు వాయిదా.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

మిథునం:

ఈరోజు మీరు ధన లాభాలని పొందుతారు.వాహన కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

అనుకోకుండా పాత స్నేహితులను కలుస్తారు.కాస్త సమయాన్ని కాలక్షేపం చేస్తారు.వ్యాపారస్తులకు పనులు త్వరగా పూర్తవుతాయి.

కర్కాటకం:

ఈరోజు మీకు ఇతరుల నుండి సహాయం అందుతుంది.తీరికలేని సమయంతో గడుపుతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని దైవ దర్శనాలు చేయాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో విజయం ఉంటుంది.

సింహం:

ఈరోజు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.

కన్య:

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.మీరు పనిచేసే చోట కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి లేదా మీ వ్యక్తిత్వాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది.తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులెదురవుతాయి.

తులా:

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఇతరులతో కలిసి కొన్ని ముఖ్యమైన ప్రయాణాలు చేస్తారు.ఆర్థికంగా అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కుటుంబ సభ్యుల నిర్ణయం తీసుకోవాలి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.అనవసరమైన వస్తువులను వీలైనంత వరకు కొనుగోలు చేయకపోవడం మంచిది.మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దైవ దర్శనాలు చేస్తారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

ధనస్సు:

ఈరోజు మీరు ధనాన్ని పొదుపు చేయాలి.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.తోబుట్టువుల నుండి ఆర్థిక విషయంలో వాదనలు జరుగుతాయి.

దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.వ్యాపారస్తులకు నష్టాలు ఎదురవుతాయి.ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి.

మకరం:

తీరికలేని సమయంతో గడపడం వల్ల ఈరోజు విశ్రాంతి దొరుకుతుంది.కుటుంబ సభ్యుల ఒకరి ఆరోగ్య సమస్య కుదుటపడుతుంది.దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.

మీ మంచితనం పట్ల మీ వ్యక్తిత్వాన్ని పొందుతారు.కొన్ని దైవ దర్శనాలు చేస్తారు.ఈ రోజంతా సంతోషంగా ఉంటుంది.

కుంభం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.

బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

మీనం:

ఈరోజు మీరు ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.దీనివల్ల విశ్రాంతి లేకుండా పోతుంది.

వ్యాపారులు ముఖ్యమైన పనులు వాయిదా వేయడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

#February28 #Daily Horoscope #Jathakam #TeluguDaily

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

DEVOTIONAL