తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఫిబ్రవరి 23, మంగళవారం, 2021

Telugu Daily Astrology Prediction Rasi Phalalu February 23 Tuesday 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం:ఉదయం 06.20

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu February 23 Tuesday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం:సాయంత్రం 06.00

రాహుకాలం: మ.03.00 నుంచి 04.30 వరకు

అమృత ఘడియలు: మ.04.30 నుంచి 06.30 వరకు

దుర్ముహూర్తం: ఉ.08.24 నుంచి 09.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈ రోజు మీరు తొందర పడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రతగా ఉండాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో కొన్ని పనులు వాయిదా పడుతాయి.

వృషభం:

ఈ రోజు మీకు ఆర్థికంగా అభివృద్ధి ఉంది.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇంట్లో కొన్ని శుభ కార్యాలు జరుగుతాయి.దీన్ని వల్ల సంతోషం గా ఉంటారు.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.

మిథునం:

ఈ రోజు మీరు ఏదైన పనులు మొదలు పెట్టే ముందు సక్రమంగా సాగుతుంది.మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి.కొన్ని ప్రయాణాలు చేస్తారు.

దైవ దర్శనాలు చేస్తారు.ఈ రోజంతా అనుకూలంగా ఉంది.

కర్కాటకం:

ఈ రోజు మీకు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదురవుతాయి.దీన్ని వల్ల మనశ్శాంతి లేకుండా పోతుంది.కొన్ని దైవ దర్శనాలు చేస్తారు.మీ పాత స్నేహితులను కలుస్తారు.సమయాన్ని కొంత వరకు కాలక్షేపం చేస్తారు.

సింహం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.లేదా భవిష్యత్తులో నష్టాలు ఎదురవుతాయి.దూరప్రాంత బంధువుల నుండి శుభవార్త వింటారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.

కన్య:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి.మీ బంధువులతో కలిసి సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో పనులు త్వరగా పూర్తి అవుతాయి.

తులా:

ఈరోజు మీరు కొన్ని పనులను వాయిదా పెడతారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవాలి.

వృశ్చికం:

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.కొన్ని ఉత్సాహపరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.అనుకోకుండా కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

ధనస్సు:

ఈరోజు మీరు అనవసరంగా తొందర పడడం వల్ల మీ వ్యక్తిత్వాన్ని కోల్పోయే అవకాశం ఉంది.దీనివల్ల కుటుంబ సభ్యుల నుండి ఇబ్బందులు ఎదురవుతాయి.మీరు పనిచేసే చోట ఆటంకం ఏర్పడి పనులు ఆలస్యంగా పూర్తవుతాయి.

మకరం:

ఈరోజు మీకు ఇతరుల నుండి ఆర్థికంగా సహాయం అందుతుంది.కొన్ని వస్తువులను కొనుగోలు చేస్తారు.కొన్ని దైవ దర్శనాలు వంటివి చేస్తారు.బంధు మిత్రులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

కుంభం:

ఈరోజు మీరు కొన్ని విలువైన వస్తువులను కోల్పోయే అవకాశం ఉంది.ఆరోగ్య సమస్య మరింత ఇబ్బంది పెడుతుంది.కుటుంబ సభ్యులు మీకు కొంత ధైర్యాన్ని కల్పిస్తారు.మీరు పనిచేసే కాస్త ఒత్తిడి ఎక్కువవుతోంది.

మీనం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంట్లో పండగ వాతావరణం వల్ల సంతోషంగా గడుపుతారు.వాహన కొనుగోలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

#TeluguAstrology #Tuesday #Jathakam #Horoscope

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube