తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -ఫిబ్రవరి 11 గురువారం 2021

Telugu Daily Astrology Prediction Rasi Phalalu February 11 Thursday 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.44

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu February 11 Thursday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.16

రాహుకాలం: మ.01.55 నుంచి 03.21 వరకు

అమృత ఘడియలు: ఉ.03.51 నుంచి 05.28 వరకు

దుర్ముహూర్తం: ఉ.06.48 నుంచి 08.13 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.అనుకున్న పనులు త్వరగా పూర్తవుతాయి.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో విజయం ఉంటుంది.మీరు పనిచేసే చోట అధికారుల నుండి సహాయం అందుతుంది.

వృషభం:

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులెదురవుతాయి.ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.అనవసరమైన ఖర్చులు చేయడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా పడతాయి.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఆలోచించాలి.

మిథునం:

ఈ రోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.తోబుట్టువులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట కాస్త ఒత్తిడి గా ఉంటుంది.

కర్కాటకం:

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.మీ వ్యక్తిత్వం వల్ల శత్రువులు మిత్రులు అవుతారు.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్థులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

సింహం:

ఈరోజు మీకు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.మీ వ్యక్తిత్వం వల్ల ఇతరుల నుండి వాదనలు ఎదురవుతాయి.కొన్ని ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి.

తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.వ్యాపారస్తులకు కొన్ని ముఖ్యమైన పనులు సక్రమంగా జరుగుతాయి.

కన్య:

ఈరోజు తీరికలేని సమయంతో గడుపుతారు.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.మీ కుటుంబ సభ్యులతో కలిసి గడపడానికి ప్రయత్నించండి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో నష్టాలు కలుగుతాయి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

తులా:

ఈరోజు కొన్ని కష్టమైన పనులను ధైర్యంతో పూర్తి చేస్తారు.ఏదైనా పని మొదలు పెట్టడానికి అనుకూలంగా ఉంది.కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.మీ వ్యక్తిత్వం పట్ల శత్రువులు మిత్రులు అవుతారు.వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

వృశ్చికం:

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.తీరికలేని సమయంతో గడపడం వల్ల ఈ రోజు విశ్రాంతి దొరుకుతుంది.ఖర్చులను పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

ధనస్సు:

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెట్టే ముందు కాస్త ఆలోచించాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.

కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు‌.కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

మకరం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.మీ కుటుంబ సభ్యుల ఒకరి ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.

కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

కుంభం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో లాభాలుంటాయి.అనవసరమైన ఖర్చులు చేయకండి.తీరికలేని సమయంతో గడుపుతారు.కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపారస్థులకు, ఉద్యోగస్తులకు పనులలో అనుకూలంగా ఉంది.

మీనం:

ఈరోజు మీరు కొన్ని లాభాలను పొందుతారు.వాహన కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి దూరప్రయాణాలు చేస్తారు.

అనుకోకుండా పాత స్నేహితులను కలవడం వల్ల సంతోషంగా గడుపుతారు.మీ తోబుట్టువుల నుండి సహాయం అందుతుంది.

ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

#Jathakam #Thursday #TeluguDaily #Daily Horoscope

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube