ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 06.49
సూర్యాస్తమయం: సాయంత్రం 06.11
రాహుకాలం: మ.01.55 నుంచి 06.21 వరకు
అమృత ఘడియలు: ఉ.08.40 నుంచి 10.10 వరకు
దుర్ముహూర్తం: ఉ.10.36 నుంచి 11.22 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:

ఈ రాశి వారు నేడు ఎంతో శుభ సూచకంగా కనిపిస్తుంది.ఎప్పటి నుంచో ఉన్న వివాదాలు సద్దుమణుగుతాయి.కోర్టు వివాదాలలో విజయం సాధిస్తారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతూ దైవదర్శనం చేసుకుంటారు.
వృషభం:

ఈ రాశి వారు నేడు అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.ప్రయాణ సమయంలో జాగ్రత్తగా ఉండటం ఎంతో అవసరం.అనవసర ఖర్చులు అవుతాయి.
చిరకాల మిత్రులను కలుసుకుని సూచనలు కనబడుతున్నాయి.విద్యార్థులకు నేడు ఎంతో అనుకూలంగా ఉంది.
మిథునం:

మిధున రాశి వారికి ఈ రోజు ఎంతో లాభదాయకంగా ఉంటుంది.ఏదైనా వ్యాపారాలు పెట్టుబడులు పెట్టాలి అనుకునే వారికి ఎంతో అనువైన సమయం.ఉద్యోగ వృత్తి వ్యాపారాలలో పని చేసేవారు మంచి లాభాలను పొందుతారు.ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం.
కర్కాటకం:

కర్కాటక రాశి వారికి నేడు అనుకోకుండా డబ్బులు కలిసి వస్తాయి.ఎప్పటి నుంచో రావలసిన బాకీలు వసూలవుతాయి.అయితే ఈ రాశి వారు ఇతరులతో గొడవపడి సూచనలు ఎక్కువగా ఉన్నాయి కనుక వీలైనంత వరకు ఎవరితో మాట్లాడక పోవడం ఇంటి నుంచి బయటకు వెళ్లకపోవడం మంచిది.
సింహం:

ఈ రాశి వారికి గత కొద్ది రోజుల నుంచి వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తి అవుతాయి.ఈ రాశివారు ఎంతో ఒత్తిడిని ఎదుర్కోవలసి ఉంటుంది.శ్రమకు తగ్గ ఫలితం లభించడంతో పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా గడుపుతారు.
కన్య:

కన్య రాశి వారు అనుకోకుండా చిరకాల మిత్రులను బంధువులతో ఎంతో సంతోషంగా గడుపుతారు.కుటుంబ సభ్యులతో కలిసి దైవదర్శనానికి వెళతారు.ఈ రాశివారికి వృధా ఖర్చులు అయ్యే సూచనలున్నాయి.ప్రయాణ సమయంలో జాగ్రత్తలు ఎంతో అవసరం.
తులా:

తులా రాశి వారు ఈరోజు ఎలాంటి పనులు మొదలు పెట్టిన శుభసూచకంగా కనబడుతుంది.వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడానికి ఎంతో అనువైన సమయం.ఇక ఏదైనా ఇంటర్వ్యూలకు వెళ్లేవారికి విజయం వరిస్తుంది.నిరుద్యోగులకు నేడు అనుకూలంగా ఉంటుంది.
వృశ్చికం:

ఈ రాశివారికి నేడు ప్రయోజనకరంగా ఉంటుంది.ఎప్పటి నుంచో వివాదంలో ఉన్న కోర్టు పనులలో గెలుపు సాధిస్తారు.వ్యాపార రంగంలో ఉన్న వారికి అధిక లాభాలు వచ్చే సూచనలు కనబడుతున్నాయి.అయితే ఈ రాశి వారు జీవిత భాగస్వామితో గొడవ పడే సూచనలు ఉన్నాయి.
ధనస్సు:

ధనస్సు రాశి వారికి ఈ రోజు ఎంతో లాభదాయకంగా కనబడుతుంది.అయితే ఈ రాశి వారు వీలైనంత వరకూ ఇంటి నుంచి బయటకు పోవడం ఎంతో మంచిది.ప్రయాణాలు చేయాల్సి వచ్చినా వాటిని నేటికి వాయిదా వేసుకోవడం మంచిది.ఇతరులతో గొడవపడే సూచనలు ఉన్నాయి కనుక ఈరోజు ఎవరితోను మాట్లాడకపోవడమే ఉత్తమం.
మకరం:

మకర రాశి వారు ఈ రోజు ఏమాత్రం తీరిక లేకుండా గడపాల్సి ఉంటుంది.అధిక ఒత్తిడి శ్రమ కారణంగా అనారోగ్యానికి గురవుతారు.అయితే మీ శ్రమకు తగ్గ ఫలితాన్ని అనుభవిస్తారు.అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.
కుంభం:

కుంభ రాశి వారు అనుకున్న పనులను సకాలంలో పూర్తిచేస్తారు.అలాగే అనుకోకుండా ధనయోగం కలుగుతుంది.ఈ కారణంగా బంధుమిత్రులతో గొడవలు పడే సూచనలు ఉన్నాయి.
చిరకాల మిత్రులను కలుసుకుంటారు.విద్యా రంగంలో ఉన్న విద్యార్థులకు నేడు ఎంతో అనుకూలంగా ఉంది.ఇంటర్వ్యూలకు వెళ్లేవారికి ఉద్యోగం వచ్చే సూచనలు కనబడుతున్నాయి.
మీనం:

మీన రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదని చెప్పాలి.నేడు ఈ రాశివారు శత్రువులతో గొడవ పడే సూచనలు ఉన్నాయి.దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.
కుటుంబ సభ్యులతో కలిసి దైవదర్శనానికి వెళతారు.వీలైనంత వరకు ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.