తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 7, మంగళ వారం, 2021

Telugu Daily Astrology Prediction Rasi Phalalu December 7 Tuesday 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.16

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu December 7 Tuesday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.26

రాహుకాలం: సా.3.00 ల4.30

అమృత ఘడియలు:చవితి,సా.4.00ల6.00

దుర్ముహూర్తం:ఉ.8.24ల9.12,ప.10.46ల11.36

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.మీ కుటుంబ సభ్యుల బాధ్యత ఎక్కువగా ఉంటుంది.అనవసరంగా ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకూడదు.ఇతరులు మీకు ఆర్థికంగా సహాయం చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడుల విషయంలో తొందరపడకూడదు.

వృషభం:

ఈరోజు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ముందుగా కుటుంబ సభ్యులకు తెలియ చేయాలి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.కొన్ని ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం చాలా వరకు మంచిది.

మిథునం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఇతరులకు సహాయం చేశారు.ఇదివరకు అప్పుగా తీసుకున్న మీ సొమ్ము తిరిగి ఇస్తారు.కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.సమయాన్ని కాపాడుకోవాలి.

కర్కాటకం:

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట ఒత్తిడిగా ఉంటుంది.

సింహం:

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.కొన్ని పరిచయాలు మీకు జీవిత బంధంగా మారుతాయి.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు అనుకూలంగా ఉంది.

కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేస్తారు.అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.కుటుంబ సభ్యులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోవడం మంచిది.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.శత్రువులకు దూరంగా ఉండటం చాలా మంచిది.

తులా:

ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం బట్టి భవిష్యత్తు ఉంటుంది.ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంట్లో ఓ శుభకార్యం జరుగుతుంది.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.దీని వల్ల కొన్ని లాభాలు అందుకుంటారు.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.కుటుంబ సభ్యుల బాధ్యతలను గౌరవించాలి.ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉన్నాయి.అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు మీకు అందుతాయి.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

ధనస్సు:

ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.దీనివల్ల కాస్త మనశ్శాంతిగా ఉంటుంది.అనవసరమైన విషయాల గురించి పట్టించుకోకండి.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.కొత్త పరిచయాలు అనుకూలంగా ఉంటాయి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

మకరం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.దూర ప్రయాణాలు చేస్తారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.శత్రువుల కు దూరంగా ఉండాలి.ఏ విషయంలో నైనా కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవాలి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

కుంభం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.వాహన కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.మీ స్నేహితులను కలవడం వల్ల వారితో పాత జ్ఞాపకాలు నెమరు వేసుకుంటారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి గా ఉంటుంది.

మీనం:

ఈరోజు మీరు అనవసరమైన విషయాలలో తలదూర్చకండి.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.సంతానం గురించి ఆలోచించాలి.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.నిరుద్యోగులు ఉద్యోగం కోసం బాగా ప్రయత్నించాలి.

#Horoscope #TeluguAstrology #Jathakam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube