తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 6, సోమవారం, మార్గశిర మాసం, 2021

Telugu Daily Astrology Prediction Rasi Phalalu December 6 Monday 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.14

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu December 6 Monday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.25

రాహుకాలం: ఉ.07.30 నుంచి 09.00 వరకు

అమృత ఘడియలు: ఉ.09.00 నుంచి 10.00 వరకు

దుర్ముహూర్తం: ఉ.12.24 నుంచి 01.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

వ్యాపారస్తులకు ఎక్కువ లాభాలు ఉన్నాయి.సమయాన్ని కాపాడుకుంటారు.

వృషభం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేశారు.పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.వ్యాపారస్తులకు ఈ రోజు అనుకూలంగా ఉంది.భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.ఇతరులకు సహాయం చేస్తారు.

మిథునం:

ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం బట్టి మీ భవిష్యత్తు ఉంటుంది.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.పనిచేసే చోట ఒత్తిడి గా ఉంటుంది.

కర్కాటకం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనుకోకుండా మీఇంటికి బంధువులు వస్తారు.వ్యాపారస్తులు ఇతరుల సహాయం అందుకుంటారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

సింహం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

కన్య:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేయటం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.

తులా:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకుంటారు.సమయాన్ని కాలక్షేపం చేయండి.

వృశ్చికం:

మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.అనుకున్న పనులు ప్రారంభించడానికి ఈరోజు అనుకూలంగా ఉంది.మీ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.పెద్ద నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఫలితాలు ఉంటాయి.ఈ రోజు అనుకూలంగా ఉంది.

ధనస్సు:

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం చాలా మంచిది.మీ పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించాలి.

కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల సమయం కాలక్షేపం అవుతుంది.సమయాన్ని కాపాడుకోవాలి.

మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వాయిదా పడిన పనులు పూర్తి చేసుకోవడం మంచిది.కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయాల్సి ఉంటుంది.

కుంభం:

ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.వ్యాపారస్తులకు ఇతరుల సహాయం అందుతుంది.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

మీనం:

ఈరోజు మీరు కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన పనులు చేయడంవల్ల సమయం కాలక్షేపం అవుతుంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

శత్రువులకు దూరంగా ఉండాలి.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.

ఈరోజు పాత స్నేహితులను కలుస్తారు.

#Jathakam #TeluguAstrology #Monday #Horoscope

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube