తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 5 శనివారం, 2020

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.10

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu December 5 Saturday 2020-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.42

రాహుకాలం: మ.01.00 నుంచి 02.46 వరకు

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu December 5 Saturday 2020-తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్ 5 శనివారం, 2020-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమృత ఘడియలు: ఉ.08.10 నుంచి 09.30 వరకు

దుర్ముహూర్తం: ఉ.07.29 నుంచి 08.07 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఏ రాశి వారికి ఈ రోజు ఎంతో అనుకూలంగా ఉంది.చేసే పనిలో నూతన మార్పులు ఏర్పడతాయి.ఒక మహిళ స్నేహితురాలి వల్ల సహాయ సహకారాలను అందుకుంటారు.ఆఫీసు వాతావరణం ఎంతో అనుకూలంగా ఉంటుంది.

వృషభం:

ఏ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి.ఆఫీస్ వ్యవహారాలలో ఇబ్బందులు తలెత్తుతాయి.అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.ఇన్ని రోజులుగా ఎదుర్కొంటున్న వ్యాపార సమస్యలను అధిగమిస్తారు.

మిథునం:

ఈ రాశి వారికి అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.కానీ ఈ ప్రయాణం వల్ల లాభం కలుగుతుంది.చాలాకాలం తరవాత వ్యక్తిగత జీవితం గురించి ఆలోచనలు చేస్తారు.వృత్తికి సంబంధించిన శుభవార్త వింటారు.

కర్కాటకం:

కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎంతో అనుకూలం అని చెప్పవచ్చు.చేసే పనులలో పురోగతి ఉంటుంది.రాజకీయ నాయకులు, విద్యార్థులకు వృత్తిపరంగా మంచి అవకాశాలు లభిస్తాయి.వ్యాపార రంగంలో కొంతవరకు ఒత్తిడిని ఎదుర్కోవలసి ఉంటుంది.

సింహం:

ఈ రాశి వారికి ఈ రోజు అదృష్టం బాగా కలిసి వస్తుంది.వ్యాపార రంగంలో లాభాలుంటాయి.విద్యార్థులకు ఎంతో అనువైన సమయం పోటీపరీక్షల తప్పకుండా విజయాన్ని సాధిస్తారు.ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

కన్య:

ఏ రాశి వారికి ఈ రోజు సృజనాత్మకతతో పనిచేసే అవకాశం ఉంటుంది.రాజకీయ నాయకులకు ఈ రోజు ఎంతో కలిసి వస్తుంది.మీరు ఎంచుకున్న రంగంలో పై అధికారుల నుంచి సహాయ సహకారాలు అందించడం వల్ల విజయవంతంగా పనులను పూర్తిచేస్తారు.కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా గడుపుతారు.

తులా:

ఈ రాశి వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.వీలైనంత వరకు ఎక్కువగా తాగాలి వెళ్లకుండా ఉండటం ఎంతో మంచిది.భార్య తరపు నుంచి సహాయ సహకారాలు అందుతాయి.

బంగారు నగలను కొనుగోలు చేస్తారు.విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.

వృశ్చికం:

ఈ రాశి వారికి ఈ రోజు అనుకోని సమస్యలు తలెత్తుతాయి.కానీ వాటిని ధైర్యంగా ఎదుర్కో వలసి ఉంటుంది.తెలియని శత్రువుల నుంచి సమస్యలు ఎదురు కావడం వల్ల వ్యాపార రంగంలో కూడా నష్టాలను చవి చూస్తారు.విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది.

ధనస్సు:

ఈ రాశివారు ఆస్తికి సంబంధించి నటువంటి వివాదాలు తీరతాయి.కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.వ్యాపార రంగాలలో పురోగతి సాధించడానికి కష్టపడాల్సి ఉంటుంది.విద్యార్థులకు ఇదే సరైన సమయం.భాగస్వామి మద్దతు తెలపడంతో విజయాలను అందుకుంటారు.

మకరం:

ఈ రాశి వారికి ఈ రోజు ఎంతో అనుకూలం అని చెప్పవచ్చు.ఇష్టమైన వ్యక్తుల నుంచి కానుకలను స్వీకరిస్తారు.కుటుంబ విషయాలను గురించి ఆరాధిస్తారు.

కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా గడుపుతారు.ఆఫీసులలో అనుకూల వాతావరణం ఏర్పడింది.

కుంభం:

ఈ రాశి వారు ఈ రోజు వీలైనంత వరకు తగాదాలకు దూరంగా ఉండటం మంచిది.ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్త అందే అవకాశం ఉంది.వ్యాపార రంగంలో లాభాలను పొందుతారు గత కొద్ది రోజులుగా బాధిస్తున్న సమస్య నుంచి ఉపశమనం పొందుతారు.

మీనం:

ఈ రాశి వారికి ఈ రోజు అనుకూల ఫలితాలు కలుగుతాయి.అధికంగా శ్రమించడం వల్ల ఎంచుకున్న రంగంలో కీర్తి, ప్రతిష్ఠలు పొందుతారు.పై అధికారుల మద్దతు లభించడం ద్వారా అనుకున్న పనులు దానికి పూర్తి చేసి ప్రశంసలు పొందుతారు.

ఎన్నో రోజులుగా వేధిస్తున్న పాత రుణాలు నుంచి విముక్తి పొందుతారు.

#Jathakam #Saturday #TeluguDaily #Daily Horoscope

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU