తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 14, మంగళవారం, మార్గశిర మాసం 2021

Telugu Daily Astrology Prediction Rasi Phalalu December 14 Tuesday 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.16

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu December 14 Tuesday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.26

రాహుకాలం: మ.03.00 నుంచి 04.30 వరకు

అమృత ఘడియలు: ఉ.10.30 నుంచి 11.30 వరకు

దుర్ముహూర్తం: ఉ.08.24 నుంచి 09.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టిన సక్రమంగా పూర్తి చేస్తారు.ఇతరులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయాలి.

తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.సమయాన్ని కాపాడుకోవాలి.

వృషభం:

ఈరోజు మీరు అనవసరమైన విషయాలను దూరం పెడతారు.దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.కొన్ని శుభకార్యాల్లో పాల్గొంటారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు ఇతర సలహాలు తీసుకోవాలి.

మిథునం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.

తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.వ్యాపారస్తులు పెట్టుబడి లాభాలు అందుకుంటారు.

కర్కాటకం:

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.అవసరం లేని విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.దీనివల్ల ఎటువంటి ఫలితం ఉండదు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకునే అవకాశం ఉంది.

సింహం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.పిల్లల నుండి శుభవార్త వింటారు.

వాయిదా పడిన పనులు పూర్తి చేసుకోవడానికి అనుకూలంగా ఉంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

కన్య:

ఈరోజు ఆర్థికంగా పొదుపు చేయాలి.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.తల్లిదండ్రులతో కలిసి ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయాలి.కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.ముఖ్యమైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.సమయాన్ని  కాపాడుకోవాలి.

తులా:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా కొన్ని ఇబ్బందులెదురవుతాయి.కాబట్టి ఇతరుల సహాయం అందుకోవటం మంచిది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తులు నిర్ణయాలు తీసుకోవాలి.సమయాన్ని వృధా చేయకూడదు.

వృశ్చికం:

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.వాహన కొనుగోలు చేసే అవకాశం ఉంది.

కుటుంబ సభ్యుల్లో  ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ వహించాలి.నిరుద్యోగులకు ఈరోజు ఉద్యోగ అవకాశం ఉంది.

ధనస్సు:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేయటం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.

మకరం:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.దీని వల్ల ఎటువంటి ఫలితాలు ఉండవు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోవద్దు.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

కుంభం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.శత్రువులకు దూరంగా ఉంటే మంచిది.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

మీనం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు అనుకూలంగా ఉంది.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.

#Tuesday #TeluguAstrology #Jathakam #Horoscope

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube