తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 3 గురువారం, 2020

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.15

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu December 1 Thursday 2020-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.43

రాహుకాలం: మ.02.00 నుంచి 02.40 వరకు

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu December 1 Thursday 2020-తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్ 3 గురువారం, 2020-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమృత ఘడియలు: ఉ.08.10 నుంచి 09.30 వరకు

దుర్ముహూర్తం: ఉ.08.09 నుంచి 09.23 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి.పిల్లల నుంచి నిరుత్సాహకరమైన వార్తలను వింటారు.విద్యార్థులు విద్యారంగంలో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా గడుపుతారు.ఈ రాశి వారికి జీవిత భాగస్వామి నుంచి మంచి మద్దతు లభిస్తుంది.

వృషభం:

ఈ రాశి వారు ఈ రోజు ఎంతో ఉల్లాసంగా గడుపుతారు.ఎన్నో రోజుల నుంచి వాయిదా పడుతున్న పనులు ఈ రోజుతో ముగుస్తాయి.విద్యార్థుల పరీక్షల విషయంలో విజయాన్ని సాధిస్తారు.రాజకీయ రంగంలో చేసే టటువంటి ప్రయత్నాలు విజయవంతమవుతాయి కుటుంబ పెద్దల సహాయ సహకారాలు అందుకుంటారు.

మిథునం:

ఈ రాశి వారు ఈ రోజు శుభకార్యాలలో పాల్గొంటారు.ఆర్థిక పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉంటుంది.వ్యాపార రంగంలో పెట్టుబడులు పెట్టే వారికి లాభాలను అందుకుంటారు.అనుకోని అతిథులు ఇంటికి రావడంతో ఎంతో సంతోషంగా గడుపుతారు.

కర్కాటకం:

ఈ రాశి వారికి ఈ రోజు అనుకోకుండా దూరప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.ఈ రాశి వారు ఈ రోజు ధన నష్టాన్ని చవి చూస్తారు.సోదరీ సోదరీమణుల నుంచి సహాయ సహకారాలను అందుకుంటారు మీరు చేసేటటువంటి పనుల వల్ల సంఘంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు.

సింహం:

ఈ రాశివారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.విదేశాల నుంచి సానుకూల వార్తలను వింటారు మీకు ఇష్టమైన వ్యక్తుల నుంచి శుభవార్తలు కూడా అందుకుంటారు.ఈ రాశి వారికి వివాహ జీవితంలో ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది.

కన్య:

ఎన్నో రోజుల నుంచి మిమ్మల్ని బాధిస్తున్న సమస్య నుంచి విముక్తి కలుగుతుంది.సకాలంలో పనులు పూర్తి చేయడం ద్వారా పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.పిల్లల నుంచి శుభవార్త ను అందుకుంది.వృత్తి రీత్యా లాభాల బాటలో పయనిస్తారు.

తులా:

ఈ రాశి వారికి ఈ రోజు సానుకూల ఫలితాలు కలుగుతాయి.వ్యాపారంలో కొత్త అవకాశాలను లబ్ధి పొందుతారు.దూర ప్రయాణాలు చేయటం వల్ల కొంతమేర డబ్బు ఖర్చు చేస్తారు.శుభకార్యాలలో పాల్గొన్న ఎంతో ఆనందంగా గడుపుతారు.

వృశ్చికం:

వృశ్చిక రాశి వారు ఎంత ధైర్యం తో వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం వల్ల లాభాలను పొందుతారు.జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభించడం వల్ల కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.ఏ రాశి వారు ఏ దేవాలయాలను దర్శించి అవకాశాలు ఉన్నాయి.ఆరోగ్య విషయంలో కొంత వరకు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది.

ధనస్సు:

ధనస్సు రాశి వారు ఈ రోజు మిశ్రమ ఫలితాలను పొందుతారు.వ్యాపార రంగంలో భాగస్వాములు నుంచి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటాయి.ఇలాంటి సమయంలో భార్య తరుపు బంధువుల నుంచి ఎంతో ప్రయోజనం పొందుతారు.మీ భాగస్వామితో గడపటానికి ఈరోజు ఎంతో అనుకూలం.

మకరం:

ఈ రాశివారికి ఈ రోజు కొన్ని బాధ్యతలు పెరుగుతాయి.కుటుంబంలో ఆర్థిక విషయాలలో విజయాన్ని సాధిస్తారు.తోటి ఉద్యోగుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి.వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.

కుంభం:

కుంభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలుంటాయి.విద్యార్థులకు అనేక అవకాశాలు లభిస్తాయి.వ్యాపార రంగంలో పురోగతి సాధిస్తారు.ఈ రాశి వారు మిత్రులు పట్ల తగినంత జాగ్రత్తగా ఉండాలి.జీవిత భాగస్వామితో ఈరోజు ఎంతో ఆనందంగా గడుపుతారు.

మీనం:

ఈ రోజు ఈ రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది.విద్యార్థులకు భవిష్యత్తులో నూతన అవకాశాలు లభిస్తాయి.దానధర్మాలు కొంతమేర డబ్బు ఖర్చు చేస్తారు.

ఈ రాశి వారికి ఈ రోజు చేసే ప్రయాణాలలో జాగ్రత్తలు పాటించాలి.

#December3 #Jathakam #Daily Horoscope #TeluguDaily

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

DEVOTIONAL