తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 14, శనివారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం:ఉదయం 05.44

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu August 14 Saturday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం:సాయంత్రం 06.27

రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు

అమృత ఘడియలు: ఉ.09.15 నుంచి 10.15 వరకు

దుర్ముహూర్తం: ఉ.08.24 నుంచి 09.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.సమయాన్ని వృథా చేయకండి.

వృషభం:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.తోబుట్టువులతో జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఇతరులతో వాదనలకు దూరంగా ఉండాలి.కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య గురించి బాగా శ్రద్ధ తీసుకోవాలి.

మిథునం:

ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడానికి ప్రయత్నించాలి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.దూరప్రాంతపు బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.

కర్కాటకం:

ఈ రోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడుల విషయంలో అనుభవం వున్నా వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.ఈ రోజు సంతోషంగా గడపాలి.

సింహం:

ఈ రోజు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.

కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.మీరు పని చేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

కన్య:

ఈ రోజు మీరు ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.ఈ రోజు ఓ శుభవార్త వింటారు.

తులా:

ఈ రోజు మీకు కొన్ని నష్టాలు ఉన్నాయి.అనవసరమైనా ఖర్చులు ఎక్కువగా చేస్తారు.పిల్లల భవిష్యత్ గురించి ఆలోచనలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.సమయాన్ని వృథా చేయకూడదు.

వృశ్చికం:

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు ఎక్కువ లాభాలు ఉన్నాయి.పిల్లల భవిష్యత్ గురించి ఆలోచనలు చేస్తారు.అనవసరంగా వాదనలకు దిగకండి.మీరు పని చేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.

ధనస్సు:

ఈ రోజు మీరు కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడుతారు.ఇతరులకు మీ వంతు సహాయం చేస్తారు.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.సంతోషంగా గడుపుతారు.

మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించి ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణం చేసేటప్పుడు అనుకూలంగా ఉంటుంది.ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులకు సమయాన్ని గడుపుతారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.

కుంభం:

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.దీని వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చించాలి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.సమయాన్ని కాపాడుకోవాలి.

మీనం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.అనవసరమైన విషయాల గురించి ఆలోచించకండి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube