తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 1, ఆదివారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.42

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu August 1 Sunday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.29

రాహుకాలం: మ.04.30 నుంచి 06.00 వరకు

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu August 1 Sunday 2021-తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగష్టు 1, ఆదివారం, 2021-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమృత ఘడియలు: అష్టమి మంచిది కాదు

దుర్ముహూర్తం: సా.04.25 నుంచి 05.13 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకండి.ముఖ్యమైన విషయాలలో కొన్ని వాగ్దానాలు చేస్తారు.పెద్దలతో సమయాన్ని గడుపుతారు.ఈరోజు మీరు పనిచేసే చోట ఓ శుభవార్త వింటారు.ఇతరులతో వాదనలకు దిగకండి.

వృషభం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టిన మంచి ఫలితాలు అందుకుంటారు.అనవసరమైన వాదనలకు దూరంగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఇతరుల నిర్ణయాలు తీసుకుంటారు.ఈ రోజు కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.

మిథునం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.కానీ ఏ పని చేయలేకపోతారు.దానివల్ల మీ పనులన్నీ ఆగిపోతాయి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయం తొందర పడతారు.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.

కర్కాటకం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.తీరికలేని సమయంతో గడుపుతారు.

కొత్త వ్యక్తులతో మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండండి.వ్యాపారస్తులకు ముఖ్యమైన విషయాలలో అనుకూలంగా ఉంది.

సింహం:

ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.దీనివల్ల పెద్దల ఆశీర్వాదాలు అందుకుంటారు.తీరిక లేని సమయంతో గడుపుతారు.మీ కుటుంబ సభ్యులతో కొన్ని దైవ దర్శనం వంటి ప్రయాణాలు చేస్తారు.తోబుట్టువులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేసే అవకాశం ఉంది.

కన్య:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఆరోగ్య పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇతరులకు సహాయం చేస్తారు.

భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.కొన్ని పనులు త్వరగా పూర్తి చేసుకుంటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయం గురించి కుటుంబ సభ్యుల సలహాలు తీసుకుంటారు.

తులా:

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీ విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.

అనుకున్న పనులను ఈ రోజు పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

వృశ్చికం:

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.ఆర్థికంగా అనుకూలంగా ఉంది.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.

దీనివల్ల నిరుత్సాహం చెందుతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

ధనస్సు:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కొన్ని ప్రయాణాలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.సమయాన్ని కాపాడుకోవాలి.

మకరం:

ఈరోజు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుకుంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఆర్థిక లాభాలు అందుకుంటారు.

ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

కుంభం:

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.సమయం వృథా చేయకూడదు.

మీనం:

ఈరోజు ఇతరులకు మీ వంతు సహాయాన్ని చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి ఉంటుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుకుంటారు.

కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.

#Jathakam #Daily Horoscope #August1st #TeluguDaily

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU