తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 9, శుక్రవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం:ఉదయం 05.54

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu April 9 Friday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం:సాయంత్రం06.11

రాహుకాలం మ.03.00 నుంచి 04.30 వరకు

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu April 9 Friday 2021-తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 9, శుక్రవారం, 2021-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమృత ఘడియలు ఉ.06.00 నుంచి 08.00 వరకు

దుర్ముహూర్తం ఉ.08.24 నుంచి 09.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.ఈరోజు కొన్ని ప్రయాణాలు అనుకూలించవు.

వృషభం:

ఈరోజు మీకు కొన్ని విషయాలలో అనుకూలంగా ఉంది.ఇతరులకు మీరిచ్చే అప్పు తీరిపోతుంది.అనుకున్న సమయానికి మీ చేతిలో డబ్బులు ఉంటాయి.

ఎక్కువ ఆర్థిక లాభాలు ఉంటాయి.విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు.ఈరోజు పనులు త్వరగా పూర్తవుతాయి.

మిథునం:

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.తొందరపడి మాట్లాడటం వల్ల మీ వ్యక్తిత్వాన్ని కోల్పోతారు.సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

ఇతరుల మాటలు వినడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.కొన్ని దూరప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.

కర్కాటకం:

ఈరోజు మీకు సంతోషం గా ఉంటుంది.ఆర్థికంగా ఎక్కువ లాభాలు పొందుతారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొంటారు.విద్యార్థులు ఉన్నత పరీక్షలలో పోటీ చేస్తారు.ఆరోగ్యం పట్ల అనుకూలంగా ఉంది.దైవ దర్శనం వంటి ప్రయాణాలు చేస్తారు.ఈరోజు పనులు త్వరగా పూర్తవుతాయి.

సింహం:

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.విలువైన వస్తువులు కోల్పోతారు.

దీనివల్ల నిరుత్సాహం చెందుతారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి.మీరు పనిచేసే టు జాగ్రత్తగా ఉండాలి.

కన్య:

ఈరోజు మీకు ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.

విద్యార్థులు కష్టపడి చదువుకోని పైకి వస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

తులా:

ఈరోజు మీరు సంతోషంగా గడుపుతారు.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

ఆర్థిక లాభాలు ఉన్నాయి.గతంలో మీరు కోల్పోయిన డబ్బు అందుతుంది.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలున్నాయి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

వృశ్చికం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆర్థికంగా పొదుపు చేస్తారు.అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉంటారు.దీని వల్ల ఆర్థికంగా లాభం ఉంటుంది.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.గతంలో కోల్పోయిన వస్తువులు తిరిగి పొందుతారు.కుటుంబ సభ్యులతో కలసి సమయాన్ని గడపాలి.

ధనస్సు:

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.విద్యార్థులు కష్టపడి చదవడం మంచిది.

కొన్ని పనులు సక్రమంగా పూర్తవుతాయి.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు పనుల విషయంలో అనుకూలంగా ఉంది.

మకరం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.విద్యార్థులు చదువు పట్ల విజయం సాధిస్తారు.గతంలో ఇతరులకు ఇచ్చిన సొమ్ము తిరిగి లభిస్తుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఇతరుల సహాయం పొందుతారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

కుంభం:

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.భవిష్యత్తులో దీని వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.

సంతానం పట్ల ఆలోచించాలి.కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవాలి.కొన్ని పనులు వాయిదా పడతాయి.

మీనం:

ఈరోజు మీరు కొన్ని పనులు త్వరగా పూర్తి చేస్తారు.ఆరోగ్యంపట్ల అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేస్తారు.

నూతన పరిచయాలు ఏర్పడతాయి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

#TeluguDaily #April9 #Daily Horoscope #Jathakam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU