తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 25, ఆదివారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.45

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu April 25 Sunday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.12

రాహుకాలం: మ.04.30 నుంచి 06.00 వరకు

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu April 25 Sunday 2021-తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 25, ఆదివారం, 2021-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమృత ఘడియలు: ఉ.06.00 నుంచి 10.00 వరకు

దుర్ముహూర్తం: మ.04.25 నుంచి 05.13 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీకు ఇతరుల నుండి ఆర్థిక సహాయం కలుగుతుంది.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఒక శుభవార్త వింటారు.

దీనివల్ల సంతోషంగా గడుపుతారు.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.వ్యాపార పెట్టుబడి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి.

వృషభం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ నష్టాలు ఎదురవుతాయి.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.ఆరోగ్యసమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.

మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యులతో సమస్యల గురించి పరిష్కారం తెలుసుకోవాలి.

మిథునం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటకం:

ఈరోజు మీరు ఆర్థిక అభివృద్ధి పొందుతారు.కొన్ని విలువైన వస్తువులు కొంటారు.కొన్ని దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.సంతానం పట్ల ఆలోచన చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా లేదు.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

సింహం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.లేదా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.తొందరపడి మీ వ్యక్తిత్వాన్ని కోల్పోకండి.మీరు పనిచేసే చోట కాస్త ఒత్తిడి ఉంటుంది.

కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ నష్టాలను ఎదుర్కొంటారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయాంలో ఇతరుల సహాయం పొందే అవకాశం ఉంది.

తులా:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొంటారు.తల్లిదండ్రులతో కాస్త సమయాన్ని గడపాలి.

కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి‌.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

వృశ్చికం:

ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.అనుకోకుండా మీ స్నేహితుల నుండి సహాయం అందుతుంది.ముఖ్యమైన విషయాలలో తొందరపడకూడదు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

ధనస్సు:

ఈరోజు మీరు ఆర్థిక పొదుపు చేయడం మంచిది.దీనివల్ల భవిష్యత్తులో ఎక్కువ లాభాలు ఉంటాయి.కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.కొన్ని విలువైన వస్తువులు చేజారకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి.

మకరం:

ఈరోజు మీకు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్య సమస్య ఈరోజు కుదుటపడుతుంది.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి నిర్ణయాలు తీసుకోవాలి.ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపార పెట్టుబడి విషయంలో పనులు వాయిదా పడతాయి.

కుంభం:

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొంటారు.బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు.

ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది.దీనివల్ల సంతోషంగా ఉంటారు వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

మీనం:

ఈరోజు మీకు ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది.కొత్త పరిచయాలు ఏర్పడతాయి.బంధువుల నుండి శుభవార్త వింటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో సహాయం అందుతుంది.ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యుల నిర్ణయం తీసుకోవాలి.దీనివల్ల మంచి విజయం ఉంటుంది.

#Jathakam #April25 #TeluguDaily #Daily Horoscope

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU