తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 19, సోమవారం,2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం:ఉదయం 05.50

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu April 19 Monday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం:సాయంత్రం 06.11

రాహుకాలం:ఉ.07.30 నుంచి 09.00 వరకు

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu April 19 Monday 2021-తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 19, సోమవారం,2021-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమృత ఘడియలు:ఉ.09.00 నుంచి 10.30 వరకు

దుర్ముహూర్తం:ఉ.12.24 నుంచి 01.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.వాహన కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి.

ఇతరులకు మీ సొమ్ము తిరిగి వస్తుంది.ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది.

వృషభం:

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరులకు అప్పుగా మీ సొమ్ముని ఇవ్వకూడదు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా పడతాయి.

మిథునం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.చేజారిన తిరిగి పొందే అవకాశం ఉంది.ఆరోగ్యం కుదుట పడుతుంది.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తల్లిదండ్రులతో మాట్లాడాలి.వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి సహాయం పొందుతారు.

కర్కాటకం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.ఒక శుభవార్త వింటారు.దీనివల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో పనులు త్వరగా పూర్తవుతాయి.

సింహం:

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని పనులు వాయిదా పడుతాయి.తోబుట్టువులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.తల్లిదండ్రులతో ముఖ్యమైన విషయాల గురించి నిర్ణయాలు తీసుకోవాలి.

కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.ఇతరులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో నష్టాలు ఎదుర్కొంటారు.

తులా:

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.ఆరోగ్యంపట్ల అనుకూలంగా ఉంటుంది.కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులకు ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

వృశ్చికం:

ఈరోజు మీకు అనుకోకుండా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

తొందరపాటు నిర్ణయాలు మీ వ్యక్తిత్వాన్ని కోల్పోయేలా చేస్తాయి.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

ధనస్సు:

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలను ఎదుర్కొంటారు.అనవసరమైన వస్తువులను కొంటారు.దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.మీరు పనిచేసే చోట ఇబ్బందులెదురవుతాయి.

మకరం:

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.అనుకోకుండా కొన్ని ప్రయాణం చేయవలసి ఉంటుంది.దీనివల్ల అనుకూలంగా ఉంటుంది.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మనశ్శాంతి కలుగుతుంది.

కుంభం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.మీ కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.తోబుట్టువులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తారు.వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.

మీనం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.ఇతరులు మీ సొమ్ము తిరిగి ఇవ్వడం ఆలస్యం చేస్తారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.

అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకపోవడం మంచిది.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ఒత్తిడి ఎక్కువవుతుంది.

#TeluguDaily #Jathakam #Monday #Daily Horoscope

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU