తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 16, శుక్రవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం:ఉదయం 05.50

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu April 16 Friday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం:సాయంత్రం 06.11

రాహుకాలం: ఉ.10.30 నుంచి 04.30 వరకు

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu April 16 Friday 2021-తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 16, శుక్రవారం, 2021-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమృత ఘడియలు: చవితి సాయంత్రం ఉ.05.00 నుంచి 06.30 వరకు

దుర్ముహూర్తం: ఉ.08.24 నుంచి 09.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.తల్లిదండ్రులతో సంతోషంగా గడిపేందుకు ప్రయత్నించాలి.

కొన్ని ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో పనులు త్వరగా పూర్తి అవుతాయి.

వృషభం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.ఆరోగ్యం పట్ల పలు జాగ్రత్తలు తీసుకోవాలి.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయం గురించి పెద్దల నిర్ణయాలు తీసుకోవాలి.

మిథునం:

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంది.

కర్కాటకం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.కొన్ని ప్రయత్నాల వల్ల మీ సమస్య తీరిపోతుంది.బంధువుల నుండి శుభవార్త వింటారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.వ్యాపారస్తులు తల్లిదండ్రుల నిర్ణయాలు తీసుకోవాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

సింహం:

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.తల్లిదండ్రులతో కాస్త సమయాన్ని గడపాలి.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

కన్య:

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.కొన్ని అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

స్నేహితుల నుండి సహాయం పొందుతారు.వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.మీరు పనిచేసే చోట పనులు వాయిదా పడతాయి.

తులా:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇస్తారు.కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్య గురించి జాగ్రత్త తీసుకోవాలి.

కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యుల నిర్ణయం తీసుకోవాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ నష్టాలను ఎదుర్కొంటారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా స్నేహితుల నుండి సహాయం అందుకుంటారు.

ధనస్సు:

ఈరోజు మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.తీరిక లేని సమయం గడుపుతారు.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల భవిష్యత్తులో సమస్యలు ఎదురవుతాయి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా పడతాయి.

మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.ఎక్కువ వస్తువులను కొనుగోలు చేయకపోవడం మంచిది.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వడం లో ఆలస్యం చేస్తారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా లేదు.పని చేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

కుంభం:

ఈరోజు మీరు కొన్ని పనులు వాయిదా వేయడం మంచిది.ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.

మీనం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ నష్టాలు ఎదుర్కొంటారు.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.దీని పట్ల మనశ్శాంతి కోల్పోతారు.

మీ స్నేహితుల నుండి సహాయం పొందుతారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.

ఉద్యోగస్తులకు ఇబ్బందులు ఎదురవుతాయి.

#Daily Horoscope #TeluguDaily #Jathakam #April16

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU