తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 13, మంగళవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.54

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu April 13 Tuesday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.11

రాహుకాలం: మ.03.00 నుంచి 04.30 వరకు

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu April 13 Tuesday 2021-తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 13, మంగళవారం, 2021-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమృత ఘడియలు: ఉ.06.00 నుంచి 08.00 వరకు

దుర్ముహూర్తం: ఉ.08.24 నుంచి 09.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీకు కొన్ని పనులు సక్రమంగా సాగుతాయి.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.

ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపడానికి ప్రయత్నించాలి.

వృషభం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇతరులు అప్పుగా తీసుకున్న మీ సొమ్మును తిరిగి ఇస్తారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఎక్కువ లాభాలు ఉన్నాయి.

మిథునం:

ఈరోజు మీకు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.తొందరపడి మీ వ్యక్తిత్వాన్ని కోల్పోకండి.

ఇతరులతో ఆలోచించి మాట్లాడాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.ఈ రోజు కాస్త ధైర్యంగా ఉండాలి.

కర్కాటకం:

ఈరోజు మీకు ముఖ్యమైన విషయాల గురించి నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలంగా ఉంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కాస్త జాగ్రత్తగా ఆలోచించాలి.

సింహం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.తీరిక లేని సమయం గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.

కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఒక శుభవార్త వింటారు.

దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఈరోజు ఆనందంగా గడుస్తుంది.

కన్య:

ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.ఇతరులు మీకు ఇచ్చే సొమ్మును ఆలస్యం చేస్తారు.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.ఇతరులతో జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి.కొన్ని ప్రయాణాలు అనుకూలం గా ఉంటాయి.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

తులా:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.మీ కుటుంబ సభ్యుల ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

వృశ్చికం:

ఈరోజు మీరు కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు ఇబ్బందులు ఎదురవుతాయి.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.తొందర పడడం వల్ల మీ వ్యక్తిత్వాన్ని కోల్పోతారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా వేసుకోవడం మంచిది.

ధనస్సు:

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆర్థికంగా ఎక్కువ నష్టాలు ఉన్నాయి.అవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.

సంతానం పట్ల జాగ్రత్తగా ఉండాలి.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

మకరం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.వాహనాలు కొనుగోలు చేస్తారు.కొన్ని దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఎక్కువ లాభాలు పొందుతారు.

కుంభం:

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

ఇతరులతో కలిసి కొన్ని విషయాల గురించి చర్చిస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇతరుల సహాయం అందుతుంది.

మీనం:

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.భవిష్యత్తులో దీనివల్ల నష్టాలు ఎదురవుతాయి.కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

#TeluguDaily #April13 #Daily Horoscope #Jathakam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU