అప్పుడు సిక్స్‌తో.. ఇప్పుడు సెంచరీతో హీరోగా మారిన తెలుగు కుర్రాడు.. ఐపీఎల్ వేలంలో జాక్‌పాట్ కొట్టనున్నాడా?

తెలుగు క్రికెటర్ అయిన కోన శ్రీకర్ భరత్ అద్భుత ఆట ప్రదర్శనతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాడు.తాజాగా జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీ సాధించి ఆశ్చర్యపరిచాడు.

 Telugu Cricketer Ks Bharath Scores Century In Vijay Harare Trophy Details, Ipl A-TeluguStop.com

అయితే దేశవాళీ ట్రోఫీలో కేఎస్ భరత్ చేసిన అజేయ సెంచరీ ఇప్పుడు ఐపీఎల్ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.తాజాగా ఆంధ్ర ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ మధ్య గ్రూప్-ఏ లీగ్ మ్యాచ్‌ జరిగింది.

ఈ మ్యాచ్‌లో తెలుగు కుర్రాడు భరత్ 14 ఫోర్లు, 8 సిక్స్‌లతో హిమాచల్ ప్రదేశ్‌ బౌలర్లను ఉతికారేసాడు.మొత్తంమీద 109 బంతుల్లో 161 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.

విధ్వంసకర బ్యాటింగ్‌తో ఈ యువ ఆటగాడు ఆకాశమే హద్దు అన్నట్లు చెలరేగిపోతుంటే ప్రత్యర్థి జట్టు నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండిపోయింది.ఈ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 322 పరుగులు సాధించింది.

ఈ భారీ స్కోరు సాధించడంలో అశ్విన్ హెబ్బర్ కూడా కీలక పాత్ర పోషించాడు.అతడు 132 బంతుల్లో సెంచరీ చేసి ఘన విజయానికి కారణమయ్యాడు.

భారీ లక్ష్య ఛేదనతో బ్యాటింగ్‌కు దిగిన హిమాచల్ ప్రదేశ్ 46 ఓవర్లకే ఆలౌటైంది.కెప్టెన్ రిషీ ధావన్ 79 పరుగులతో ఫర్వాలేదనిపించినా మిగతావారంతా విఫలమయ్యారు.

దాంతో హిమాచల్ ప్రదేశ్ 292 పరుగులు మాత్రమే చేయగలిగింది.ఆంధ్ర బౌలింగ్ విభాగంలో గిరినాథ్ రెడ్డి 4 వికెట్లు పడగొట్టాడు.

దాంతో విజయం సుగాంతం అయ్యింది.

Telugu Century, Ind Nz, Ipl, Konasreekar, Ks Bharath, Latest, Rcb Franchise, Six

ఇక ఐపీఎల్ విషయానికొస్తే.ఫిబ్రవరి 2021లో ఆర్‌సీబీ ఫ్రాంచైజీ కేఎస్‌ భరత్‌ ను రూ.20 లక్షల కనీస ధరకే కొనుగోలు చేసింది.కానీ ఈసారి అతడు ఐపీఎల్ 2022 మెగా వేలంలో జాక్‌పాట్ కొట్టే ఆకాశాలు ఎక్కువగా ఉన్నాయి.దీనికి రెండు కారణాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు.భరత్ ఐపీఎల్ 2021 సెకండాఫ్ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడిన మ్యాచ్‌లో లాస్ట్ బంతికి సిక్సర్ బాదాడు.దాంతో పరాజయం పాలవుతుందనుకున్న ఆర్‌సీబీ జట్టు 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ పై అనూహ్య విజయం సాధించింది.

Telugu Century, Ind Nz, Ipl, Konasreekar, Ks Bharath, Latest, Rcb Franchise, Six

వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ 52 బంతుల్లో 78 పరుగులు చేసి హీరోగా మారిన భరత్‌ అప్పట్లో అన్ని ఫ్రాంఛైజీల దృష్టిలో పడ్డాడు.తాజాగా 161 పరుగులతో మళ్లీ ఫ్రాంఛైజీల దృష్టిని ఆకట్టుకుంటున్నాడు.వికెట్‌కీపర్‌ కమ్‌ బ్యాట్స్‌మన్‌ అయిన భరత్‌ ఇటీవలే న్యూజిలాండ్‌, టీమిండియా మధ్య జరిగిన టెస్ట్‌ సిరీస్‌లో తాత్కాలిక వికెట్ కీపర్‌గా తన ప్రతిభ చూపి అందరి ప్రశంసలు దక్కించుకున్నాడు.ఈ నేపథ్యంలో అతడు ఈసారి ఖచ్చితంగా భారీ ధర పలుకుతాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube