సౌందర్య చనిపోగానే ఆమె కుటుంభం చెదిరిపోయింది.. ఆమె భర్త, వదిన కూడా....

తెలుగులో కొన్ని వందల కుపైగా చిత్రాలలో కమెడియన్ గా నటించి సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ సీనియర్ నటుడు “బాబు మోహన్” గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే బాబు మోహన్ మరియు టాలీవడ్ ప్రముఖ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు గారు నటించిన కామెడీ సన్నివేశాలు ఇప్పటికి యూట్యూబ్ లో ట్రెండింగ్  వరుస లో నిలుస్తున్నాయి.

 Telugu Comedian Babu Mohan About His Relation With Former Actress Soundarya In F-TeluguStop.com

తాజాగా నటుడు బాబు మోహన్ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని ప్రముఖ నటి సౌందర్యతో తనకు ఉన్నటువంటి అనుబంధం గురించి ప్రేక్షకులతో పంచుకున్నారు.

ఇందులో భాగంగా తనకి సౌందర్య కూతురులాంటిదని అందువల్లనే ఎప్పుడూ కూడా తాను సౌందర్యని బంగారు పాప అని పిలిచేవాడినని అంతగా తమ మధ్య సన్నిహితం ఉండేదని చెప్పుకొచ్చాడు.

అయితే నటి సౌందర్య ఒకప్పటి మహానటి సావిత్రి లాగా అందం, అభినయం, అనుకువ, ఉన్నటువంటి నటి అని, ఎవరితో ఎలాంటి విభేదాలు లేకుండా స్టార్ హీరోయిన్ అయినప్పటికీ చాలా గౌరవ మర్యాదలతో ఇతర నటీ నటుల పట్ల ఉండేదని చెప్పుకొచ్చాడు.

అయితే చిన్న వయసులోనే సినిమా పరిశ్రమకు వచ్చి స్టార్ హీరోయిన్ గా నిలదొక్కుకొని తనకంటూ కొద్దిపాటి ఆస్తులను మరియు ప్రేక్షక ఆదరణను సంపాదించుకున్న సౌందర్య  కానీ అవేమీ అనుభవించకుండా నే కన్నుమూసిందని కొంతమేర ఎమోషనల్ అయ్యాడు.

ఇక సౌందర్య కుటుంబ విషయానికొస్తే ఎప్పుడూ కూడా ఆర్థిక సంబంధిత లావాదేవీలను సౌందర్య అన్నయ్య అమర్ చూసుకునేవాడిని, ఇక సౌందర్య డేట్ల విషయం మరియు షూటింగుల వివరాలు వంటి వాటిని ఆమె తండ్రి చూసుకునేవాడిని తెలిపాడు.

సౌందర్య తో పాటు తన తన సోదరుడు కూడా మరణించడంతో సౌందర్య భర్త మరియు సౌందర్య వదినలు ఆస్తుల విషయమై తగువు పడ్డారని చెప్పుకొచ్చాడు.

అయితే ఇటీవలే సౌందర్య తల్లికూడా మరణించిందని ఈ విషయం తెలిసి తాను ఎంతగానో బాధ పడ్డానని తెలిపాడు.ఇక సౌందర్య మరణాంతరం ఆమె భర్త రఘు మరియు వదిన ఇప్పుడు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారనే విషయాలు తనకు తెలియదని , సౌందర్య మరణంతోనే ఆమె కుటుంబంతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు కూడా తెగిపోయాయని తెలిపాడు.

ఇక ఈ మధ్య కాలంలో తాను ఎందుకు సినిమాల్లో నటించడం లేదనే విషయంపై స్పందిస్తూ ఈ మధ్య తన పాత్రకి ప్రాధాన్యత ఉన్నటువంటి అవకాశాలు రావడం లేదని అందువల్లనే తాను సినిమాల్లో నటించడంలేదని తెలిపాడు.ఒకవేళ భవిష్యత్తులో తన పాత్రకి ప్రాధాన్యత ఉన్న అవకాశాలు వస్తే మళ్లీ సినిమాల్లో తప్పకుండా నటిస్తానని కూడా స్పష్టం చేసాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube