ఆ డైరెక్టర్ కి 7వ తరగతిలోనే సొంతంగా ఆఫీస్ ఉండేది....

టాలీవుడ్లో పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తెలుగు ప్రముఖ నటుడు “ఉత్తేజ్” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.కాగా నటుడు ఉత్తేజ్ సినిమా పరిశ్రమకు వచ్చిన కొత్తలో పలు చిత్రాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పని చేసాడు.

 Telugu Character Artist Uttej About Puri Jagannath Office At  7th Class Age, Tel-TeluguStop.com

ఆతర్వాత డైలాగ్ రైటర్ గా అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పని చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.కాగా తాజాగా యూట్యూబ్ ఛానల్ నిర్వహించి న ఇంటర్వ్యూలో పాల్గొని టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ గురించి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.

అయితే ఇందులో భాగంగా దర్శకుడు పూరి జగన్నాథ్ ఈ 7వ తరగతి చదువుతున్నప్పుడే హైదరాబాదులోని అమీర్ పేట్ పరిసర ప్రాంతంలో సొంతంగా ఆఫీస్ ఉండేదని చెప్పుకొచ్చాడు.అయితే చిన్నప్పుడు తన స్నేహితులతో మాట్లాడడానికి ఈ ఆఫీస్ ని ఉపయోగించే వాడని తెలిపాడు.

అంతేకాకుండా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరియు పూరి జగన్నాథ్ ల మధ్య చాలా వ్యత్యాసం ఉందని చెప్పుకొచ్చాడు.అంతే కాకుండా పూరి జగన్నాథ్ చిత్రాల్లో ఎక్కువగా పర్సనాలిటీ డెవలప్మెంట్ మరియు పంచ్ డైలాగులు ఎక్కువగా ఉంటాయని అందువల్లే ప్రేక్షకులు ఎక్కువగా పూరి జగన్నాథ్ చిత్రాలను ఇష్టపడతారని కూడా తెలిపాడు.

ఇక సినిమాలపై తనకున్న ఇష్టం గురించి తెలియజేస్తూ తనకు ఇప్పటి వరకు సినిమాలు, నటన తప్ప ఇతర పనులు తెలియవని చెప్పుకొచ్చాడు.

అలాగే సినిమాల ద్వారా గతాన్ని ప్రజలకు కళ్లకు కట్టినట్లు చూపించడమే కాకుండా ఎన్నో మంచి పనుల గురించి కూడా తెలియజేయవచ్చని అందుకే తనకు సినిమాలంటే చాలా ఇష్టమని తెలిపాడు.

కాగా పూరి జగన్నాథ్ సినిమా పరిశ్రమలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న రోజులలో చాలా కష్టాలు పడ్డాడని ఆ కష్టాలని కళ్లారా చూశానని కూడా తెలిపాడు.అయితే ఈ విషయం ఇలా ఉండగా నటుడు ఉత్తేజ్ తెలుగులో దాదాపుగా 100కి పైగా చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో నటించి బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు.

అంతేకాకుండా 10కి పైగా చిత్రాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేయడమే కాకుండా డైలాగ్ రైటర్ గా కూడా పని చేసాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube