తెలుగులో పలు కార్యక్రమాల ఆర్టిస్ట్ పాత్రలో నటించి సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన టాలీవుడ్ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ మధ్య కాలంలో సురేఖవాణి సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే ఆక్టివ్ గా ఉంటోంది.
అంతే గాక కరోనా వైరస్ ప్రభావం కారణంగా సినిమా షూటింగులు లేకపోవడంతో సెలవులను బాగానే ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలో అప్పుడప్పుడు తన కూతురుతో కలిసి పలు పర్యాటక ప్రాంతాలను చూడడానికి వెళ్లిన సమయంలో తీసినటువంటి ఫోటోలను షేర్ చేస్తోంది.
కాగా తాజాగా సురేఖ వాణి తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.అయితే ఈ ఫోటోలో సురేఖవాణి సన్ గ్లాసెస్ ధరించి కొంతమేర బ్యూటిఫుల్ గా కనిపిస్తోంది.
దీంతో సురేఖ వాణి అందానికి నెటిజన్లు ఫిదా అయ్యారు.అంతేగాక నాలుగు పదుల వయసు దాటినప్పటికీ సురేఖ వాణి ఇప్పటికీ చాలా యంగ్ గా కనిపిస్తూ ఫిట్నెస్ మెయింటెన్ చేస్తోందంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరికొందరైతే ఏకంగా మీరు సినిమాల్లో హీరోయిన్ గా కచ్చితంగా ప్రయత్నించాలని అంటూ సలహాలు ఇస్తున్నారు.కాగా ఈ ఇప్పటివరకూ సురేఖ వాణి అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాను దాదాపుగా మూడు లక్షల పైచిలుకు మంది నెటిజన్లు ఫాలో అవుతున్నారు.
దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సురేఖ వాణి కి సోషల్ మీడియాలో ఉన్నటువంటి క్రేజ్ ఏమిటో అని.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం సురేఖ వాణి తెలుగులో పలు చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.కాగా ఈ మధ్య సురేఖ వాణి తన కూతురు సుప్రీతని నటిగా సినిమా పరిశ్రమకు పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ నటి సురేఖ వాణి మాత్రం గతంలో ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో తన కూతుర్ని హీరోయిన్ చేయడం ఇష్టం లేదని తెలిపింది.