పడక గది కమిట్మెంట్లు ఇవ్వలేకే హీరోయిన్ కాలేకపోయనంటున్న సీరియల్ నటి...

టాలీవుడ్ లో పలు సీరియళ్ళు మరియు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పని చేసి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న “క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజశ్రీ రెడ్డి” గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే నటి రాజశ్రీ రెడ్డి మొదట్లో దూరదర్శన్ చానల్ లో కొంతకాలం పాటు న్యూస్ రీడర్ గా పని చేసింది.

 Character Artist Rajashree Reddy Comments On Casting Couch,rajashree Reddy, Telu-TeluguStop.com

ఆ తర్వాత మెల్లగా పలు ధారావాహికలలో నటించే అవకాశం దక్కించుకొని సినిమాల్లో కూడా అమ్మ, అక్క, వదిన, తదితర పాత్రలలో నటించి బుల్లితెర ప్రేక్షకులను బాగానే అలరించింది. అయితే తాజాగా నటి రాజశ్రీ రెడ్డి ఇటీవలే ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొంది.

ఈ ఇంటర్వ్యూ లో భాగంగా తన సినీ జీవితంలో ఎదుర్కొన్న కొన్ని సంఘటనల గురించి ప్రేక్షకులతో పంచుకుంది.అయితే ఇందులో ముఖ్యంగా తాను హీరోయిన్ కావాలని సినిమా పరిశ్రమకి వచ్చానని, కానీ పలు అనివార్య కారణాల వల్ల  హీరోయిన్ కాలేక పోయానని తెలిపింది.

అయితే తాను హీరోయిన్ కాలేకపోవడానికి ముఖ్య కారణంగా అప్పట్లో పలువురు దర్శక నిర్మాతలు అడిగిన కమిట్మెంట్లను ఇవ్వకపోవడమే నని చెప్పుకొచ్చింది.
  అయినప్పటికీ తనకేమీ బాధలేదని అంతేకాక సినిమా పరిశ్రమలో తాను మాత్రం ఎప్పుడూ క్యాస్టింగ్ కౌచ్ సమస్యలకు లొంగ లేదని అంతేగాక ఈ క్రమంలో ఇలాంటి కమిట్మెంట్లు ఇవ్వలేదనే చాలా సినిమా అవకాశాలని వదులుకున్నానని తెలిపింది.

 అయితే తనని కమిట్మెంట్ అడిగినటువంటి దర్శక నిర్మాతల పేర్లు చెప్పడానికి మాత్రం రాజశ్రీ రెడ్డి ఇష్టపడలేదు.

అలాగే మన పొరుగు సినీ పరిశ్రమ అయినటువంటి కన్నడ సినీ పరిశ్రమలో తెలుగు ఆర్టిస్టులను ప్రోత్సహించరని దాంతో చాలా మంది యువ నటీ నటులు తెలుగు సినీ పరిశ్రమకు తరలి వస్తున్నారని దీంతో తెలుగు ఆర్టిస్టులకు కొంతమేర అవకాశాలు తగ్గుతున్నాయని అభిప్రాయం వ్యక్తం చేసింది.

అలాగే నటన అనేది యూనివర్సల్ కాబట్టి మనలో టాలెంట్ ఉంటే హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, ఇలా ఏదైనా చిత్ర పరిశ్రమలతో సంబంధం లేకుండా ఎక్కడైనా నటించ వచ్చని కాబట్టి సినీ పరిశ్రమలో మన స్థాయి ఏంటనేది మనకు ఉన్న టాలెంట్ నిర్ణయిస్తుందని చెప్పుకొచ్చింది.

అయితే నటి రాజశ్రీ రెడ్డి ఇప్పటి వరకు చాలా మందికి ఆమె కేవలం నటిగా మాత్రమే తెలుసు.

 కానీ ఈమె తెలుగు సినీ పరిశ్రమలో దాదాపు 15 సంవత్సరాలు స్క్రిప్ట్ రైటర్ గా కూడా పని చేసింది.అంతేగాక నటిగా, మంచి దర్శకురాలిగా, నిర్మాతగా తన ప్రతిభను కనబరిచి మూడు నంది అవార్డులను కూడా గెలుచుకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube