సినిమా పరిశ్రమలో అలాంటి వాటిని అస్సలు సహించనంటున్న సీనియర్ నటి…  

Telugu character artist pragathi latest interview news, Pragathi, Tollywood, Character Artist, Low aspiration, Telugu actress, pragathi gym workout, Videos, - Telugu Character Artist, Low Aspiration, Pragathi, Pragathi Gym Workout, Telugu Actress, Telugu Character Artist Pragathi Latest Interview News, Tollywood, Videos

తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అక్క, అమ్మ, చెల్లెలు, తదితర పాత్రలలో చక్కగా ఒదిగిపోయి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ “ప్రగతి” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే నటి ప్రగతి మొదట్లో సినిమా పరిశ్రమకి హీరోయిన్ కావాలని వచ్చినప్పటికీ పలు వ్యక్తిగత కారణాల వల్ల ఆమె హీరోయిన్ కాలేకపోయింది.

TeluguStop.com - Telugu Character Artist Pragathi Latest Interview News

 దీంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో కూడా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకొని ప్రస్తుతం సినిమా పరిశ్రమలో బాగానే రాణిస్తోంది. అయితే తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో నటి ప్రగతి పాల్గొంది.

ఇందులో భాగంగా తన సినీ ప్రయాణంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులు గురించి ప్రేక్షకులతో పంచుకుంది.

TeluguStop.com - సినిమా పరిశ్రమలో అలాంటి వాటిని అస్సలు సహించనంటున్న సీనియర్ నటి…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అందరిలాగే మొదటగా తాను కూడా తన నటనా ప్రతిభను నిరూపించుకుని మంచి నటిగా ఎదగాలని ఎన్నో ఆశలతో కళ్ళతో సినిమా పరిశ్రమకి వచ్చానని తెలిపింది.

 కానీ సినిమా పరిశ్రమకు వచ్చిన తరువాత మన ఊహలకి నిజ జీవితానికి చాలా తేడా ఉందని గ్రహించినట్లు చెప్పుకొచ్చింది.అంతేగాక సినిమా పరిశ్రమలో మనం ఇతరులతో నడుచుకునే విధానాన్ని బట్టి మన క్యారెక్టర్ ని డిసైడ్ చేస్తారని కాబట్టి అందరితో సత్ప్రవర్తన కలిగి ఉండడం మంచిదని తెలిపింది.

  అయితే తనని చిన్నచూపు చూడడం లేదా తనపై అజామాయిషి చెలాయించడం వంటివి చేస్తే అస్సలు సహించనని  వెంటనే అలాంటి వారిని దూరం పెట్టేస్తానని కూడా పేర్కొంది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో సినిమా షూటింగులు లేక కొంత కాలంగా నటి ప్రగతి ఇంటి పట్టునే ఉంటోంది.

 ఈ క్రమంలో ఆరోగ్యానికి మేలు చేకూర్చే యోగా మరియు జిమ్ వర్కౌట్లు, ఆహార పదార్థాల డైట్ తదితర అంశాలతో తన ఆరోగ్య ఫిట్నెస్ మెరుగు పరుచుకుంటోంది.అంతేగాక అప్పుడప్పుడు తాను జిమ్ వర్కౌట్లు చేస్తున్న సమయంలో వీడియోలు తీసి తన సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేస్తోంది.

#Pragathi #Low Aspiration #TeluguCharacter #Videos #PragathiGym

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Telugu Character Artist Pragathi Latest Interview News Related Telugu News,Photos/Pics,Images..