ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఒక్క సినిమాకి అంత తీసుకుంటుందా...?

తెలుగులో అమ్మ, అక్క, వదిన, చెల్లి, తదితర పాత్రలలో నటించి తన సెంటిమెంటల్ నటనతో సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న  ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ “పవిత్ర లోకేష్” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే పవిత్ర లోకేష్ మొదటగా సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా పలు చిత్రాలలో నటించినప్పటికీ ఆ చిత్రాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో కొంతకాలం పాటు సినిమా అవకాశాలు లేక ఉద్యోగం కూడా చేసింది.

 Telugu Character Artist Pavitra Lokesh Remuneration News, Pavitra Lokesh, Telugu-TeluguStop.com

ఆ తర్వాత మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో నటించడం మొదలు పెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ తదితర భాషల్లో నటిస్తూ బాగానే రాణిస్తోంది పవిత్ర లోకేష్.

కాగా పవిత్ర లోకేష్ పారితోషికం విషయమై పలు వార్తలు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

  అయితే ఇందులో ముఖ్యంగా పవిత్ర లోకేష్  తెలుగు చిత్రాలలో నటించేందుకు ఒక్క రోజుకి దాదాపుగా 50 వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకూ తీసుకుంటుందని సమాచారం. ఒకవేళ అవుట్ డోర్ షూటింగ్ అయితే ప్రత్యేక విమానం టికెట్లు మరియు హోటల్ గదులు చార్జీలు కూడా దర్శక నిర్మాతలు భరిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే పవిత్ర లోకేష్ స్వతహాగా కన్నడ సినీ పరిశ్రమకు చెందిన నటి అయినప్పటికీ ఆమె కి తెలుగులోనే నటిగా ఎక్కువ గుర్తింపు వచ్చింది. అందువల్లనే ఇప్పటివరకు పవిత్ర లోకేష్ దాదాపుగా సీనియర్ నుంచి జూనియర్ వరకు అందరి హీరోల చిత్రాల్లో అమ్మ పాత్రలలో నటించింది.

కాగా ఇటీవలే తెలుగులో యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా నటించిన “రెడ్” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించింది. అయితే ఈ చిత్రంలో ఎప్పుడూ లేని విధంగా పవిత్ర లోకేష్ కొంతమేర భిన్నంగా సిగరెట్ కాల్చుతూ మద్యం సేవించే అలవాటు ఉన్న మహిళ పాత్రలో నటించింది.

దీంతో ఈ విషయం ఒక్కసారిగా సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అయింది. ఆమధ్య ఈ విషయంపై పవిత్ర లోకేష్ స్పందిస్తూ తాను కేవలం పాత్ర డిమాండ్ చేయడం వల్లే అలా నటించానని అంతే తప్ప తనకు ఎలాంటి చెడు అలవాట్లు లేవని స్పష్టం చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube