అందుకే నా కూతుర్ని హీరోయిన్ చేయకూడదని అనుకున్నానని అంటున్న సీనియర్ నటి…  

Telugu character artist Jaya Lakshmi about her daughter Yamani Swetha as heroine entry, Jaya Lakshmi, Telugu character Artist, Yamani Swetha, Jayam movie fame, tollywood,  - Telugu Jaya Lakshmi, Jayam Movie Fame, Telugu Character Artist, Telugu Character Artist Jaya Lakshmi About Her Daughter Yamani Swetha As Heroine Entry, Tollywood, Yamani Swetha

తెలుగులో ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వం వహించిన “జయం” చిత్రంలో హీరోయిన్ చెల్లెలి పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న “చైల్డ్ ఆర్టిస్ట్ యామిని శ్వేత” ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులకు బాగానే గుర్తుంటుంది.అయితే ఈ చిత్రంలో నటించిన అనంతరం యామిని శ్వేత సినిమాలకి దూరంగా వెళ్ళిపోయింది.

TeluguStop.com - Telugu Character Artist Jaya Lakshmi About Her Daughter Yamani Swetha As Heroine Entry

ఈ క్రమంలో తన పై చదువులపై దృష్టి సారించి ఇతర దేశాల్లో ఉన్నత చదువులను చదివి మంచి ఉద్యోగం లో స్థిర పడింది.అయితే తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూలో యామిని శ్వేత తల్లి మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ జయలక్ష్మి పాల్గొంది.

ఇందులో భాగంగా తన సినీ జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది.

TeluguStop.com - అందుకే నా కూతుర్ని హీరోయిన్ చేయకూడదని అనుకున్నానని అంటున్న సీనియర్ నటి…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే ఇందులో తాను ఇప్పటికే తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మరియు కొంతమేర బోల్డ్ తరహా పాత్రలలో కూడా నటించానని కానీ ప్రస్తుతం తనకి నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి పాత్రలో నటించడమంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది.

ఇక తన కూతురు ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ కేవలం యామిని శ్వేత ని చైల్డ్ ఆర్టిస్ట్ గా మాత్రమే చూడాలి అనుకున్నామని అందువల్లే జయం చిత్రంలో నటించిన తర్వాత ఆమెని పై చదువుల కోసం ఇతర దేశాలకు పంపించి ఉన్నత చదువులు చదివించామని చెప్పుకొచ్చింది.ప్రస్తుతం యామిని శ్వేత పెళ్లి చేసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుందని కూడా తెలిపింది.

కానీ తన రెండవ కూతురు ఈ మధ్య సినిమా పరిశ్రమ పై బాగా ఆసక్తి కనబరుస్తోందని అందువల్ల ఆమెను మల్టీమీడియా లోని యానిమేషన్ కోర్సును చదివిస్తున్నామని చెప్పుకొచ్చింది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా జయలక్ష్మి వెండి తెరపై మాత్రమే కాకుండా బుల్లితెరపై కూడా పలు ధారావాహికలలో నటించి ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంటోంది.

కాగా ప్రస్తుతం పలు తెలుగు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తోంది.

#Yamani Swetha #TeluguCharacter #TeluguCharacter #Jaya Lakshmi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Telugu Character Artist Jaya Lakshmi About Her Daughter Yamani Swetha As Heroine Entry Related Telugu News,Photos/Pics,Images..