ఆ దర్శకుడంటే నాకు ప్రాణం అంటున్న హేమ...

తెలుగులో అమ్మ, అక్క, చెల్లి, వదిన, తదితర పాత్రలలో నటించి తెలుగు సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న  ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ “హేమ” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే నటి హేమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలోనే కాకుండా అప్పుడప్పుడు కొంతమేర నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి పాత్రలో కూడా నటించి సినీ విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది.

 Telugu Actress Hema About Director Trivikram Srinivas, Hema, Telugu Actress, Tri-TeluguStop.com

కాగా తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని తన సినీ జీవితానికి సంబంధించిన కొన్ని విషయాల గురించి ప్రేక్షకులతో పంచుకుంది.

అయితే ఇందులో భాగంగా తనకు టాలీవుడ్ ప్రముఖ రొమాంటిక్ దర్శకుడు “పూరి జగన్నాథ్” అంటే ఎంతో ఇష్టమని అంతేగాక తాను పూరి జగన్నాథ్ ని అన్నయ్యలా భావిస్తానని దాంతో కొంతమేర చనువుగా ఉంటామని తెలిపింది.

అంతేగాక ఇప్పటికీ తనకు సంబంధించినటువంటి ఏదైనా విషయాలలో కీలక నిర్ణయం తీసుకోవాలంటే పూరి జగన్నాథ్ సలహా కచ్చితంగా తీసుకుంటానని చెప్పుకొచ్చింది.

Telugu Hema, Hemacontroversy, Telugu Actress, Teluguactress, Tollywood-Movie

ఆ మధ్య కాలంలో నటి హేమ టాలీవుడ్ మాటల మాంత్రికుడు మరియు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై సంచలన వ్యాఖ్యలు చేసిందంటూ వార్తలు వినిపించడంతో ఈ విషయంపై కూడా స్పందించింది.

అయితే తనకు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే “గాడ్ ఫాదర్” తో సమానమని అంతేగాక త్రివిక్రమ్ శ్రీనివాస్ కోసం తన ప్రాణాలను ఏ మాత్రం ఆలోచించకుండా ఇచ్చేస్తానని తెలిపింది. కానీ తాను ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలను కొందరు వక్రీకరించి ప్రచారాలు చేశారని, అంతే తప్ప తాను ఎలాంటి వ్యాఖ్యలు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి చేయలేదని స్పష్టం చేసింది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం హేమ పలు బాలీవుడ్ చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పని చేస్తోంది. అంతేకాక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో మెంబర్ గా ఉంటూ తన సేవలను అందిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube