యూట్యూబ్.ఇది ఒకప్పుడు జస్ట్ ఎంటర్‌టైన్మెంట్.కానీ.రాను రాను ఇందులో వీడియో క్రియేటర్స్ గా మారి పలువురు బాగా డబ్బులు సంపాదిస్తున్నారు.ఇంతకు ముందు పాటు, షార్ట్ ఫిల్మ్స్ మాత్రమే పరిమితం అయిన యూట్యూబ్ ఇప్పుడు క్రుకరీ, ట్రావెల్ వ్లోగ్స్, డిఫరెంట్ క్రియేటివ్ ఎంటర్‌టైన్మెంట్ తో పాటు ఇన్మర్మేషన్ కు కేరాఫ్ అడ్రస్ గా మారింది.
అటు సినిమాలు, టీవీ రంగాల్లో ఉన్న పలువురు యాంకర్లు యూట్యూబ్ లో చానెళ్లు ఏర్పాటు చేసుకున్నారు.
తమకు నచ్చిన కంటెంట్ తో క్రియేటర్స్ గా మారి హల్ చల్ చేస్తున్నారు.టీవీల్లో యాంకర్లుగానే కాకుండా యూట్యూబ్ లో దూసుకుపోతున్న తెలుగు యాంకర్స్ ఎవరు? వారి చానెల్స్ ఏంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సుమ కనకాల-సుమక్క చానెల్
తెలుగు సినీ,టీవీ పరిశ్రలో తనకంటే గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ సుమ.ఆమె సుమక్క చానెల్ ఏర్పాటు చేసింది.ఇందులో పలు యాత్రలు, వంటకాలకు సంబంధించిన వీడియోలు పెడుతూ దూసుకుపోతుంది.
అనసూయ- అనసూయ భరద్వాజ్
తెలుగు పాపులర్ యాంకర్ అనసూయ తను యూట్యూబ్ చానెల్ లో ఎక్కువగా పర్సనల్ వ్లోగ్స్, హోం టూర్స్, తన షో ప్రోమోలు పెడుతుంది.
లాస్య-లాస్య టాక్స్
ఒకప్పటి యాంకర్ లాస్య ఇప్పుడు యూట్యూబ్ లో హల్ చల్ చేస్తుంది.లాస్య టాక్స్ పేరుతో చానెల్ తెరిచి హోం టూర్స్ బిగ్ బాస్ సెలబ్రిటీస్ ఇంటర్వ్యూలతో పాటు కమెడీ షోలు చేస్తుంది.
శ్రీముఖి-శ్రీముఖి
వంటలు, ఫ్యాషన్, స్కిన్ కేర్ సహా పలు విషయాలను తన యూట్యూబ్ చానెల్ వేదికగా పంచుకుంటుంది.
శ్యామల- ఏం చెప్పారు శ్యామల గారు
హోం టూర్స్, చిట్ చాట్స్, వంటలు, పర్సనల్ బ్లాగ్స్ తో లక్షన్నర సబ్ స్క్రైబర్లను పొందింది శ్యామల.
రవి-యాంకర్ రవి
టాప్ మేల్ యాంకర్ రవి తన ఇంట్లో చేసే వంటలు, పర్సనల్ వ్లోగ్స్, చిట్ చాట్ ఇటర్వ్యూలు పెడుతూ దూసుకుపోతున్నాడు.
బిత్తిరి సత్తి- బిత్తిరి సత్తి
పలు చానెళ్లలో వెరైటీ మేనరిజంతో షోలు చేసే బిత్తిరి సత్తి.ఇందులో పలు వీడియోలు పోస్టు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు.
సమీరా- సమీరా షరీఫ్
బుల్లితెరపై నటిగా రాణించి యాంకర్ గా మారిన సమీరా తన ఫ్యామిలీ వ్లోగ్స్, వంటలు, ఇతర అనేక వీడియోలను పెడుతూ జనాలను ఆకట్టుకుంటుంది.