రన్నర్‌ రెండు చేస్తుంటే విన్నర్‌ ఒక్కటి కూడా మొదలు పెట్టలేదేం?

తెలుగు బిగ్‌ బాస్ సీజన్‌ 4 విజేతగా అభిజిత్ నిలువగా అఖిల్ సార్ధక్‌ రన్నర్‌ గా నిలిచిన విషయం తెల్సిందే.ఇక గత సీజన్‌ లో సోహెల్‌ ప్రత్యేక ఆకర్షణ గా నిలిచిన విషయం తెల్సిందే.

 Telugu Bigg Boss Winner Abhijeet Not Committed A Single Movie-TeluguStop.com

సోహెల్‌ ఇప్పటికే ఒక సినిమాను చేస్తున్నాడు.మరో సినిమా కు కూడా సైన్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.

మరో వైపు ఈయన వెబ్‌ సిరీస్ ల్లో కూడా నటించేందుకు ఓకే చెప్పాడనే వార్తలు వస్తున్నాయి.మొత్తానికి సోహెల్‌ బిజీ బిజీగా తన కెరీర్‌ లో ముందుకు వెళ్తున్నాడు.

 Telugu Bigg Boss Winner Abhijeet Not Committed A Single Movie-రన్నర్‌ రెండు చేస్తుంటే విన్నర్‌ ఒక్కటి కూడా మొదలు పెట్టలేదేం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక సీజన్‌ 4 విన్నర్‌ అయిన అభిజిత్ మాత్రం ఇప్పటి వరకు ఒక్కటి అంటే ఒక్క సినిమా ను కూడా మొదలు పెట్టింది లేదు.వెంటనే అభిజిత్ సినిమా ను చేస్తాడని భావించారు.

కాని ఆయన మాత్రం ఇప్పటి వరకు కొత్త సినిమా లకు ఒప్పందం చేసుకున్న దాఖాలాలు కనిపించడం లేదు.అభిజిత్‌ కథలు వింటున్నట్లుగా చెబుతున్నాడు తప్ప సినిమా ఎంపిక విషయంలో మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వడం లేదు.

అభిజిత్ మరియు ఇతర బిగ్‌ బాస్‌ స్టార్స్ కు మంచి గుర్తింపు దక్కించుకున్నారు.కాని వారిలో అభిజిత్‌ మాత్రమే పెద్దగా సందడి చేయడం లేదు.మరో వైపు అఖిల్‌ ఫస్ట్‌ టైమ్‌ అనే సినిమా తో హీరోగా పరిచయం అవ్వబోతున్నాడు.ఇదే సమయంలో తెలుగు అబ్బాయి.

గుజరాతి అమ్మాయి వెబ్ సిరీస్ ను కూడా ఈయన చేస్తున్న విషయం తెల్సిందే.పెద్ద ఎత్తున వీరి కాంబోపై ఆసక్తి వ్యక్తం అవుతోంది.

ఫస్ట్‌ టైమ్‌ సినిమాలో అఖిల్‌ హీరోగా నటించడంతో పాటు ఒక మంచి నటుడిగా గుర్తింపు దక్కించుకుంటాడనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

అఖిల్‌ ఒక సినిమా మరో వెబ్‌ సిరీస్ తో బిజీగా ఉన్నాడు.కాని విన్నర్‌ అయిన అభిజిత్ మాత్రం ఇప్పటి వరకు కొత్త సినిమా కు కమిట్‌ అవ్వలేదు.

ఇది అభిజిత్‌ అసమర్థత నా లేదంటే మరేంటీ అంటూ నెటిజన్స్‌ ప్రశ్నిస్తున్నారు.

#AkhilSarthak #BiggBoss #Akhil Sardak #Star Maa Tv Bb #Sohail

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు