దీపావళికి మరో సర్‌ ప్రైజ్‌ ప్లాన్‌ చేస్తున్న తెలుగు బిగ్‌బాస్‌

తెలుగు బిగ్‌ బాస్‌ రేటింగ్‌ ను పెంచేందుకు క్రియేటివ్‌ టీమ్‌ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది.వీక్‌ డేస్‌లో ఎలాంటి ప్రయోగాలు చేసినా కూడా ప్రయోజనం మాత్రం శూన్యం.

 Telugu Bigg Boss This Weekend Guest Is Naga Chaitanya, Naga Chaitanya, Bigg Boss-TeluguStop.com

అందుకే వీకెండ్‌ ఎపిసోడ్‌లపై ఫోకస్‌ పెట్టింది.వీకెండ్‌ ఎపిసోడ్‌లకు ప్రత్యేక గెస్ట్‌లను తీసుకు రావడం వల్ల కొంత అయినా ప్రయోజనం పొందాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

దసరా ఎపిసోడ్‌కు సమంత రావడంతో మంచి రేటింగ్‌ వచ్చింది.ఇక మొన్నటి ఎపిసోడ్‌ కు సుమ కనకాల వచ్చింది.

ఆ షోకు కూడా మంచి రేటింగ్‌ వచ్చింది.కనుక ఈ వారం ఎపిసోడ్‌కు కూడా గెస్ట్‌ను తీసుకు వచ్చే ప్లాన్‌ చేస్తున్నారు.

ఈసారి ఎవరు వస్తారు అనేది ఆసక్తిగా మారింది.గెస్ట్‌ బాధ్యత నాగార్జునది అంటూ బిగ్‌బాస్‌ టీం చెప్పడంతో తన కొడుకుల్లో ఒక్కరిని ఆయన తీసుకు వచ్చేందుకు రెడీ అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే నాగచైతన్య ఓకే చెప్పాడు అంటున్నారు.

నాగచైతన్య బిగ్‌బాస్‌ స్టేజ్‌ పై నాన్న నాగార్జునతో కలిసి సందడి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటున్నారు.

ప్రస్తుతం తెలుగు బిగ్‌బాస్‌ రేటింగ్‌ విషయంలో వస్తున్న విమర్శల కారణంగా కొన్ని బ్రాండ్‌లు తప్పుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.ఆ కారణంగా రేటింగ్‌ పెంచేందుకు నిర్వాహకులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ కిందా మీదా పడుతున్నారు.

ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించడం కోసం గత వారం సుమను తీసుకు వచ్చి చేసిన డ్రామా బాగా రక్తికట్టింది.దాంతో ఖచ్చితంగా ఈ వారం కూడా అలాంటి సర్‌ ప్రైజ్‌ ఎలిమెంట్‌ ఏమైనా ఉండే అవకాశం ఉందని అంటున్నారు.

ఇతర బిగ్‌బాస్‌లతో పోల్చితే తెలుగు బిగ్‌బాస్‌ రేటింగ్‌ చాలా తక్కువగా వస్తుంది.మొదటి రెండు మూడు వారాలు ఆకట్టుకున్నా ఇప్పుడు రేటింగ్‌ తక్కువ రావడంతో ఆదాయం గణనీయంగా పడిపోయింది.

పెడుతున్న ఖర్చుకు వస్తున్న ఆదాయానికి ఏమాత్రం పోలిక లేదు అన్నట్లుగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube