ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్ తెలుగు హీరోయిన్  భర్త అని మీకు తెలుసా...?

తెలుగులో ప్రస్తుతం స్టార్ మా లో రాత్రి 9.30 గంటల సమయంలో ప్రసారమయ్యే బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షో గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఈ షో మొదలు పెట్టిన అనతి కాలంలోనే బిగ్ బాస్ గేమ్ షో దిగ్విజయంగా మూడు సీజన్లను పూర్తి చేసుకొని ప్రస్తుతం నాలుగవ సీజన్ తో విజయవంతంగా దూసుకుపోతోంది.అయితే ఇప్పటి వరకు ఈ గేమ్ షోలో కంటెస్టెంట్ గా పాల్గొన్న దర్శకుడు సూర్య కిరణ్ గురించి చాలా మందికి తెలియదు.

 Bigg Boss Contestant Surya Kiran Husband Of Heroine Kalyani, Surya Kiran, Telugu-TeluguStop.com

అయితే దర్శకుడు సూర్య కిరణ్ టాలీవుడ్లో  పలు హిట్ చిత్రాల్లో హీరోయిన్ గా నటించినటువంటి వెటరన్ హీరోయిన్ కళ్యాణి  భర్త అని ఇప్పటికీ చాలా మందికి తెలియదు.కాగా గతంలో దర్శకుడు సూర్య కిరణ్ అక్కినేని హీరో సుమంత్ హీరోగా నటించిన “సత్యం” అనే ఓ ప్రేమకథా చిత్రానికి దర్శకత్వం వహించాడు.

కానీ ఆ తర్వాత సూర్య కిరణ్ దర్శకత్వం వహించిన బ్రహ్మాస్త్రం, చాప్టర్ 6, తదితర చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాయి. దీంతో సూర్య కిరణ్ తెలుగులో పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేక పోయాడు.

అయితే తెలుగులో సీరియళ్లలో మరియు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించినటువంటి సుజిత సూర్య కిరణ్ స్వయానా సోదరుడవుతాడు.

ఆ మధ్య కాలంలో దర్శకుడు సూర్య కిరణ్ కి తన భార్య కళ్యాణి కి మధ్య బేధాభిప్రాయాలు ఏర్పడ్డాయని అందువల్ల వారు విడాకులు తీసుకోబోతున్నట్లు పలు వార్తలు సోషల్ మీడియా మాధ్యమాలలో బలంగా వినిపించాయి.

కానీ వారి విడాకుల విషయంలో మాత్రం ఇప్పటి వరకు ఇటు కళ్యాణి గాని లేదా అటు సూర్య కిరణ్ గాని స్పందించడం లేదు.అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం కళ్యాణి  టాలీవుడ్ లో ఓ చిన్న బడ్జెట్ తరహా చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube