బిగ్ బాస్ విన్నర్ : నేను ఓట్ల కోసం డబ్బులివ్వడం మీరు చూశారా…?  

telugu bigg boss season 2 winner Kaushal manda Fire on Website news, Kaushal manda, Telugu big boss season 2 winner, Website news, fake news, Tollywood, Money for vote - Telugu Fake News, Kaushal Manda, Money For Vote, Telugu Big Boss Season 2 Winner, Telugu Bigg Boss Season 2 Winner Kaushal Manda Fire On Website News, Tollywood, Website News

తెలుగులో మొదలు పెట్టిన అనతి కాలంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకుని గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ రియాల్టీ గేమ్ షో బిగ్ బాస్ షో గురించి ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే ఇప్పటికే  ఈ షో విజయవంతంగా మూడు సీజన్లను పూర్తి చేసుకొని నాలుగో సీజన్ దూసుకుపోతోంది.అయితే తాజాగా బిగ్ బాస్ రెండవ సీజన్ విజేత కౌశల్ మంద ఓ ప్రముఖ వెబ్ సైట్ (తెలుగుస్టాప్.కామ్ కాదు) తనపై రాసినటువంటి వార్తపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

TeluguStop.com - Telugu Bigg Boss Season 2 Winner Kaushal Manda Fire On Website News

అయితే ఇంతకీ విషయం ఏంటంటే కౌశల్ మంద బిగ్ బాస్ షోలో పాల్గొన్న సమయంలో అతడికి ప్రేక్షకులు ఓట్లు వేసేందుకుగాను కౌశల్ మంద డబ్బులు ఇచ్చారని అంటూ ఓ వార్తను ప్రచురితం చేసింది.దీంతో ఆ వార్త చూసిన కౌశల్ మంద స్క్రీన్ షాట్ తీసి తన స్టోరీలో అనుసంధానం చేశాడు.

అంతేగాక తాను ఓట్ల కోసం ఆర్మీల పేర్లు క్రియేట్ చేసి డబ్బులు ఇచ్చినట్లు మీరు చూశారా.? అంటూ మండి పడ్డాడు. అంతేగాక మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా సరే తాను బిగ్ బాస్ షోలో పాల్గొన్న సమయంలో తనకి ఓటు వేసినందుకు వారికి తాను డబ్బులు ఇచ్చానని చెప్పారా.? అంటూ ప్రశ్నించాడు.
  మరోసారి ఇలాంటి వార్తలను ప్రచురిస్తే బాగోదని హెచ్చరించాడు.దీంతో ఈ విషయంపై స్పందించిన కొందరు నెటిజన్లు ఈ మధ్యకాలంలో కొందరు నిజానిజాలు తెలుసుకోకుండా సెలబ్రిటీల గురించి ఇలాంటి వార్తలు రాయడం వల్ల వారికి ప్రజల్లో నెగిటివ్ ఇంపాక్ట్ కలుగుతుందని కాబట్టి వార్తలు రాసే ముందు నిజమేంటో తెలుసుకుంటే బాగుంటుందని సూచిస్తున్నారు.

TeluguStop.com - బిగ్ బాస్ విన్నర్ : నేను ఓట్ల కోసం డబ్బులివ్వడం మీరు చూశారా…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం కౌశల్ మంద తెలుగులో బ్లాక్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో కౌశల్ మంద పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.

కాగా ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పనులు కూడా మొదలైనట్లు కౌశల్ మంద తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పేర్కొన్నాడు.మరోపక్క బుల్లితెరలో కూడా స్టార్ మా లో ప్రసారమయ్యే  “అగ్నిసాక్షి” అనే సీరియల్ లో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తున్నాడు.

#Money For Vote #TeluguBig #Kaushal Manda #TeluguBigg

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Telugu Bigg Boss Season 2 Winner Kaushal Manda Fire On Website News Related Telugu News,Photos/Pics,Images..