బిగ్‌బాస్ : వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ విషయంలో నిర్వాహకుల నుండి క్లారిటీ

తెలుగు బిగ్బాస్ నాన్ స్టాప్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.మొదట ఈ షో కి మంచి ఆదరణ లభిస్తుందని అంతా భావించారు కానీ మొదటి రెండు వారాలు మాత్రం పెద్దగా ఆదరణకు నోచుకోలేదు.

 Telugu Bigg Boss Non Stop Wild Card Entry News Details, Bigg Boss Non Stop, Bigg-TeluguStop.com

అయితే మెల్ల మెల్లగా షో గురించి సోషల్ మీడియా లో ప్రచారం ఎక్కువ అవుతూ ఉండడం తో పాటు వివిధ కారణాల వల్ల నాన్ స్టాప్ ని జనాలు అభిమానించడం ఆదరించడం మొదలు పెట్టారు.దాంతో షో నిర్వాహకులు కూడా జనాలకు మరింత ఆసక్తి కలిగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

కంటెస్టెంట్స్ తో విభిన్నమైన టాస్క్ లు చేయించడం తో పాటు వారితో ఎంటర్టైన్మెంట్ ను ప్రేక్షకుల కు ఇప్పించడం ద్వారా మంచి ఆధరణ లభిస్తుందని.అందుకే మరింతగా అదనపు ఆకర్షణ ఇచ్చేందుకు గాను త్వరలో వైల్డ్ కార్డు ఎంట్రీ ఉంటుంది అంటూ అంతా భావిస్తున్నారు.

కానీ తాజాగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారి నుండి వస్తున్న సమాచారం మేరకు ఈ సీజన్ కి కూడా కచ్చితంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది లేదు అంటూ తేల్చి చెప్పారు.మొన్నటి వరకు వైల్డ్ కార్డు ఎంట్రీ గురించి ప్రచారం జరిగినప్పటికీ తాజాగా వచ్చిన క్లారిటీ తో ఒక నిర్ణయానికి ప్రేక్షకులు వచ్చేసారు.

ప్రేక్షకులు వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ కోసం వెయిట్ చేయకుండా ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్ పర్ఫార్మెన్స్ ను ఎంజాయ్ చేస్తే బెటర్ అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Bb Nonstop, Bigg Boss, Bigg Boss Ott, Bigg Boss Wild, Biggboss, Bindhu Ma

ఇప్పటికే షో మంచి ఆదరణ సాధిస్తూ ముందుకు సాగుతోంది.ఇక బిందు మాధవి కి అభిమాన సంఘాలు అంటూ ఏకంగా ట్విట్టర్లో ఆర్మీ ఏర్పాటు అయ్యాయి.పెద్ద ఎత్తున సోషల్ మీడియా జరుగుతున్న కంటెస్టెంట్స్ అభిమానులు తమ కంటెస్టెంట్ కి ఓటు వెయ్యాలి అంటూ డిమాండ్ చేస్తూ సోషల్ మీడియా లో హడావుడి చేస్తున్నారు.

ఈ సీజన్ కి విజేతగా బిందు మాధవి నిలుస్తుంది అంటూ చాలా మంది నమ్మకంగా ఉన్నారు.ఏం జరుగుతుంది అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube