బిగ్‌ బాస్‌ 5 గురించి స్టార్‌ మా నుండి కీలక అప్‌ డేట్‌ వచ్చేసింది

తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బిగ్‌ బాస్‌ సీజన్‌ 5 కంటెస్టెంట్స్‌ విషయమై చర్చలు జరుగుతున్నాయి.సోషల్ మీడియా ద్వారా గుర్తింపు దక్కించుకున్న వారిని ఎక్కువ మందిని సీజన్‌ 5 కి తీసుకునే యోచనలో షో నిర్వాహకులు ఉన్నారు.

 Telugu Bigg Boss 5 Latest Update, Bigg Boss5, Nagarjuna, Durga Rao, Romance In B-TeluguStop.com

వారి పారితోషికాలు తక్కువ ఉండటంతో పాటు ఎక్కువ పాపులారిటీని కలిగి ఉంటారు.అందుకే వారిని తీసుకుని షో ను ఆసక్తి కరంగా తీర్చి దిద్దాలనే ఉద్దేశ్యంతో మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు.

టిక్‌ టాక్‌ స్టార్‌ దుర్గారావును ఇప్పటికే తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.ఆయనకు ఉన్న క్రేజ్‌ నేపథ్యంలో కనీసం మూడు నాలుగు వారాలు ఆయన్ను కంటిన్యూ చేసి అక్కడ నుండి పంపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఆ విషయం పక్కన పెడితే స్టార్‌ మా నుండి కీలక అప్‌ డేట్‌ బిగ్‌ బాస్ సీజన్‌ 5 నుండి వచ్చేసింది.

బిగ్‌ బాస్‌ సీజన్‌ 5 కి కూడా నాగార్జున హోస్ట్‌ గా వ్యవహరించబోతున్నాడు.

అందులో ఎలాంటి డౌటు కాని అనుమానం కాని లేదు.ఇక మరో విషయం ఏంటీ అంటే బిగ్‌ బాస్ సీజన్‌ 5 లో ప్రత్యేకంగా ఉండేలా కంటెస్టెంట్స్‌ విషయమై జాగ్రత్తలు తీసుకుంటున్నారట.

బిగ్‌ బాస్‌ ప్రేక్షకుల నుండి వస్తున్న ఫీడ్‌ బ్యాక్ మరియు హిందీ బిగ్‌ బాస్‌ కు సంబంధించిన విషయాలను పరిగణలోకి తీసుకుని కంటెస్టెంట్స్ విషయంలో నిర్ణయం తీసుకుంటున్నారు.వివాదాలు ఎక్కువగా ఉండే విధంగా కాస్త ఫైర్‌ బ్రాండ్‌ లను ఎంపిక చేసే విషయమై స్టార్‌ మా ఆలోచిస్తుంది అంటూ స్టార్‌ మా వారు స్వయంగా అంటున్నారు.

గొడవ లేదా రొమాన్స్ ఉంటేనే షో ను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తారు.కనుక అవి తప్పకుండా గత సీజన్‌ లతో పోల్చితే కాస్త ఎక్కువే ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube