సౌత్‌ ఇండియన్‌ను ప్రేమించి మోసపోయాను : మోనాల్‌

తెలుగు బిగ్‌ బాస్‌ లో అనూహ్యంగా 14 వారాల పాటు కొనసాగిన మోనాల్‌ ఇప్పుడు టాక్ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అనడంలో సందేహం లేదు.ఆమెకు ప్రేక్షకుల మద్దతు లేకున్నా కూడా ఇన్నాళ్లు కంటిన్యూ అయ్యింది అనేది చాలా మంది వాదన.

 Telugu Bigg Boss Fame Monal Gajjar About Her Love Break Up,guharathi,hindhi,sout-TeluguStop.com

అందుకే ఆమె ఆటను ఎవరు కూడా సమర్థించడం లేదు.బిగ్‌ బాస్ లోపాయికారి ఒప్పందంతో ఆమె ఇంట్లో ఒక్కరు ఇద్దరితో క్లోజ్‌ ఉండేందుకు ప్రయత్నించడంతో పాటు వారు సేవ్‌ చేస్తూ వచ్చారు అంటూ విమర్శలు ఎదుర్కొంటుంది.

ఇటీవలే బయటకు వచ్చేసిన మోనాల్‌ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తుంది.తాజాగా ఈమె ఒక వెబ్‌ ఛానెల్‌ కు ఇంటర్వ్యూ ఇచ్చింది.

ఆ ఇంటర్వ్యూలో మోనాల్‌ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించింది.ముఖ్యంగా సౌత్‌ ఇండియా ఫిల్మ్‌ ఇండస్ట్రీకి దూరం అవ్వడం వెనుక ఉన్న కారణంను ఆమె చెప్పింది.

అంతా కూడా మోనాల్‌ కు తెలుగులో ఆఫర్లు లేకపోవడంతో సౌత్‌ ఇండియా కు దూరం అయ్యిందని అనుకుంటున్నారు.కాని సుడిగాడు సినిమా విడుదల అయిన సమయంలోనే మలయాళంలో సినిమా చేసే అవకాశం వచ్చిందట.

ఆ సమయంలో ఒక మలయాళం వ్యక్తితో ప్రేమలో పడింది.ఆ వ్యక్తిని ప్రేమించి మోసపోయాను.

అతడు తనకు సెట్‌ అవ్వక పోవడంతో బ్రేకప్‌ అయ్యాను.అతడు మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన వాడు అవ్వడంతో అతడికి దూరంగా ఉండాలనే ఉద్దేశ్యంతో మొత్తం సౌత్ సినిమాలకు దూరంగా ఉండిపోయాను.

ఆ తర్వాత నేను గుజరాతి, మరాఠి, హిందీ సినిమాలు చేసుకున్నాను.బిగ్ బాస్ తెలుగు నుండి ఆఫర్‌ రావడంతో ఇటుగా వచ్చాను అంటూ చెప్పుకొచ్చింది.

వరుసగా నేను ఆఫర్లు ఉత్తరాదిన దక్కించుకోవడంతో తెలుగు వైపుకు అస్సలు దృష్ట మరల్చలేదు అంటూ పేర్కొంది.తెలుగులో ఆఫర్లు వస్తే తప్పకుండా చేస్తాను అంది.

ఇక బిగ్‌ బాస్‌ తో అఖిల్‌ తో ప్రేమ వ్యవహారం గురించి ప్రస్థావించినప్పుడు గట్టిగా నవ్వేసి సరైన సమాధానం చెప్పలేదు.దాంతో ఆమె రియల్‌ లవ్‌ కాదేమో అనిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube