పాపం …. దివి పాప తన కెరియర్ కోసం ప్రేమని కూడా త్యాగం చేసిందట…  

Telugu big boss contestant Divi love story news, Divi, Telugu big boss contestant, love story news, big boss season 4 contestant, telugu big boss news, - Telugu Big Boss Season 4 Contestant, Divi, Love Story News, Telugu Big Boss Contestant, Telugu Big Boss Contestant Divi Love Story News, Telugu Big Boss News

తెలుగులో విజయవంతంగా మూడు సీజన్లను పూర్తి చేసుకొని నాలుగో సీజన్లో కూడా దూసుకుపోతున్న ప్రముఖ రియాల్టీ గేమ్ షో బిగ్ బాస్ షో లో కంటెస్టెంట్ గా పాల్గొని ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న దివి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే నిన్నమొన్నటి వరకు దివి మోడలింగ్ లో పనిచేసినప్పటికీ పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేక పోయింది.

TeluguStop.com - Telugu Bigg Boss Contestant Divi Love Story News

కానీ ఆ మధ్య టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన మహర్షి చిత్రంలో నటించే అవకాశం రావడంతో ప్రస్తుతం బాగానే పాపులర్ అయింది.అయితే బిగ్ బాస్ షోలో పాల్గొనే ముందు ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న దివి తన కెరియర్ కోసం ప్రేమని కూడా త్యాగం చేసినట్లు తెలిపింది.

అయితే ఇందులో ముఖ్యంగా తాను చదువు పూర్తి చేసుకున్న తరువాత ఓ వ్యక్తితో ప్రేమలో పడ్డానని కానీ ఓ విషయంలో ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు రావడంతో దాదాపుగా రెండేళ్ల కాలం పాటు ఒకరికొకరు దూరమయ్యానని చెప్పుకొచ్చింది.అయితే ఆ మధ్య తన ప్రియుడు మళ్ళీ వచ్చి పెళ్లి చేసుకుందామని అడిగాడని అలాగే పెళ్లయిన అనంతరం తాను కూడా తనతో పాటే తన పల్లెటూరికి రావాల్సి ఉంటుందని చెప్పడంతో తన సినీ కెరీర్ కోసం తన ప్రేమను కూడా వదులుకున్నానని కొంతమేర ఎమోషనల్ అయ్యింది.

TeluguStop.com - పాపం …. దివి పాప తన కెరియర్ కోసం ప్రేమని కూడా త్యాగం చేసిందట…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే తన తల్లిదండ్రులు చిన్నప్పటినుంచి ఎంతో కష్టపడి పెంచారని ప్రస్తుతం ఓ మంచి స్థాయిలో ఉన్నప్పటికీ తనకంటూ గుర్తింపు కోసం పనిచేస్తున్నానని తెలిపింది.అయితే తన తల్లి లెక్చరర్ గా పని చేస్తుందని, తండ్రి ఓ ప్రముఖ యూనివర్సిటీలో ల్యాబ్ టెక్నీషియన్ గా పని చేస్తున్నాడని తెలిపింది.

అలాగే తను కాలేజీలో చదువుకునే సమయంలోనే మోడలింగ్ పై ఆసక్తి కలగడంతో ర్యాంప్ వాక్ చేయడం బాగానే నేర్చుకున్నానని ఆ తర్వాత మెల్లమెల్లగా మోడలింగ్ రంగం పై దృష్టి పెట్టానని తెలిపింది.అయితే ప్రస్తుతం తాను సినిమా అవకాశాలపై దృష్టి సారించానని ఇందులో భాగంగా 3 వెబ్ సీరిస్ లో కూడా నటిస్తున్నానని అంతేగాక మరో మూడు కొత్త చిత్రాలలో కూడా నటిస్తున్నట్లు తెలిపింది.

#TeluguBig #TeluguBig #BigBoss #TeluguBig #Divi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Telugu Bigg Boss Contestant Divi Love Story News Related Telugu News,Photos/Pics,Images..