బిబి అప్‌డేట్‌.. ఈసారి ఆ సమస్య ఎవరికి లేదు

తెలుగు బుల్లి తెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న బిగ్‌ బాస్ రేపటి నుండి ప్రారంభం కాబోతుంది.

పది నుండి పన్నెండు రోజులుగా కంటెస్టెంట్స్ అంతా కూడా క్వారెంటైన్ లో ఉన్నారు.

బిగ్ బాస్ గత సీజన్ సమయంలో క్వారెంటైన్ లో ఉంచగా ఒకరు ఇద్దరికి కరోనా పాజిటివ్‌ రావడం ఆ తర్వాత వారు పూర్తిగా కోలుకోవడం జరిగిందట.కాని ఈసారి మాత్రం బిగ్ బాస్ లోకి వెళ్లబోతున్న ఏ ఒక్కరికి కూడా పాజిటివ్ రాలేదట.

ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ ను తీసుకుని ఉన్న కారణంగా అందరికి కూడా నెగటివ్ వచ్చిందని తెలుస్తోంది.ప్రతి ఒక్కరు కూడా కరోనా వ్యాక్సిన్ రెండు డోసులను తీసుకున్నారు అనేది టాక్‌.

వ్యాక్సిన్ తీసుకున్నా కూడా ప్రతి ఒక్కరి విషయంలో కూడా చాలా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట.ముఖ్యంగా బయటి వ్యక్తులను కంటెస్టెంట్స్ కలువకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

బిగ్ బాస్ సీజన్ 5 కి భారీ రేటింగ్‌ ఖాయం గా ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు.ఎందుకంటే ఈసారి కంటెస్టెంట్స్‌ విషయంలో చాలా పాజిటివ్ బజ్ ఉంది.

అన్ని వర్గాల వారు మరియు ప్రేక్షకులు చాలా ఇంట్రెస్ట్‌ చూపించే కంటెస్టెంట్స్ ఉన్నారు.

అందుకే బిగ్ బాస్ ఈసీజన్‌ ను తప్పకుండా ప్రేక్షకులు ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.నాగార్జున హోస్ట్‌ గా వ్యవహరించబోతున్న ఈ సీజన్ లో యాంకర్ రవి తో పాటు ఇంకా ప్రముఖులు పలువురు కనిపించబోతున్నారు.ఎన్టీఆర్‌ షో ఎవరు మీలో కోటీశ్వరులు మరియు బిగ్‌ బాస్ టైమింగ్స్ వేరు వేరుగా ఉన్న కారణంగా ఎలాంటి ఇబ్బంది లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు