బిగ్‌బాస్ : రవి లేదా షన్ను సీక్రెట్‌ రూమ్ కు వెళ్లి ఉంటే!

Telugu Bigg Boss 5 Secret Room Ravi Or Shanmukh Jaswanth Is Good

తెలుగు బిగ్‌ బాస్ సీజన్ 5 చాలా నీరసంగా చప్పగా సాగుతోంది.ప్రేక్షకులు ఇంట్రెస్టింగ్ గా ఉంది అనేలా కనీసం కంటెంట్‌ ను కూడా చూపించలేక పోతున్నారు.

 Telugu Bigg Boss 5 Secret Room Ravi Or Shanmukh Jaswanth Is Good-TeluguStop.com

వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఉంటే ఏమైనా ఆసక్తిగా ఉండేదేమో కాని ఇప్పటి వరకు వైల్డ్ కార్డ్‌ ఎంట్రీ లేదు.ఇక ఉంటుంది అనే నమ్మకం కూడా లేదు.

ఈ సమయంలో సీక్రెట్ రూమ్ ఎంట్రీ కాస్త ఆసక్తిని కలిగిస్తుంది.కాని ఏమాత్రం స్కోప్ లేని లోబో హౌస్ లోని సీక్రెట్‌ రూమ్ కు వెళ్లడం పెద్దగా ఉపయోగం లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 Telugu Bigg Boss 5 Secret Room Ravi Or Shanmukh Jaswanth Is Good-బిగ్‌బాస్ : రవి లేదా షన్ను సీక్రెట్‌ రూమ్ కు వెళ్లి ఉంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

గతంలో సీక్రెట్‌ రూమ్ ఎఫెక్ట్‌ చాలా బాగా పని చేసింది.అఖిల్‌ బయటకు వెళ్లి వచ్చాడు.

ఆ సమయంలో సీక్రెట్‌ రూమ్కు వెళ్లాడు.సీక్రెట్‌ రూమ్‌ లో ఉండి వచ్చిన అఖిల్‌ రెట్టింపు ఉత్సాహంతో ఆడాడు.

కాని లోబో ఇప్పటికే డల్ గా ఉన్నాడు.ఒక వేళ సీక్రెట్ రూమ్ నుండి వచ్చినా కూడా అతడు అలాగే ఉంటాడు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

బిగ్ బాస్‌ సీక్రెట్‌ రూమ్కు రవి లేదా షన్ను వెళ్తాడని టీమ్ ఆశించారు.కాని అనూహ్యంగా ఎక్కువ శాతం మంది లోబోను ఎంపిక చేసుకుని షాక్ ఇచ్చారు.ఎక్కువగా లోబోకు ఓట్లు రావడం వల్ల ఆయన్ను బయటకు పంపించి సీక్రెట్‌ రూమ్కు పంపించాల్సి వచ్చింది.ఇది బిగ్ బాస్ టీమ్ కు కూడా పెద్దగా ఇష్టం లేదు అనేది టాక్.

వారు కనుక ఊహించినట్లుగా రవి మరియు షన్నుల్లో ఒకరు సీక్రెట్‌ రూమ్ కు వెళ్లి ఉంటే ఆట ఖచ్చితంగా మజా వచ్చేది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సీక్రెట్ రూమ్‌ అనేది చాలా పెద్ద పవర్‌.

అంటే ఆ సమయంలో లోపల ఏం జరుగుతుందో తెలుసుకుని ఆ తర్వాత వచ్చే అవకాశం ఉంది.ఎవరైతే తన గురించి మాట్లాడారో వారిపై ఓ రేంజ్ లో ఆట ఆడుకుంటూ ముందుకు సాగాలి.

అప్పుడే సీక్రెట్ రూమ్‌ యొక్క సార్థకత.కాని లోబో ఆ రేంజ్ లో దుమ్ము రేపుతాడా అంటే కష్టమే అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

#Nagarjuna #Lobo Secret #Lobo #BiggBoss #Bigg Boss

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube