బిగ్ బాస్ రేటింగ్‌పై చేతులెత్తేశారా?

తెలుగు బిగ్ బాస్ సీజన్‌ 5 రేటింగ్ విషయంలో స్టార్ మా మరియు షో నిర్వాహకులు చాలా నిరుత్సాహంతో ఉన్నారు.మొదటి ఎపిసోడ్‌ కు భారీగా రేటింగ్ దక్కిన విషయం అందరికి తెల్సిందే.

 Telugu Bigg Boss 5 Rating And Star Maa Rating Details, Bb5 Rating, Bigg Boss, Na-TeluguStop.com

మళ్లీ అప్పటి నుండి ఇప్పటి వరకు ఏమాత్రం రేటింగ్‌ పడిందే లేదు.దసరా సందర్బంగా నాలుగు గంటల ఎపిసోడ్‌ ను టెలికాస్ట్‌ చేశారు.

ఆ సందర్బంగా కూడా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది.ఇంతటి దారుణ రేటింగ్‌ గత సీజన్ ల్లో ఎప్పుడు చూడలేదు అంటూ స్వయంగా షో నిర్వాహకులు అంటున్నారు.

కంటెస్టెంట్స్ విషయంలో మొదటి నుండి విమర్శలు వస్తున్నాయి.పోయిన తర్వాత వారిలో ఏమైనా మార్పు ఉంటుందా అంటే ఏమాత్రం స్టఫ్‌ ఇచ్చేలా వారు వ్యవహరించడం లేదు.

దాంతో బిగ్ బాస్ అంటేనే ప్రేక్షకులకు బోరింగ్ గా ఉంది.

బిగ్‌ బాస్ సీజన్‌ 5 లో వివాదాలు ఎక్కువ లేవు.

కొట్టుకోవడం గుద్దుకోవడం.తిట్టుకోవడం ఏమీ లేదు.

మొత్తంగా అయితే బిగ్‌ బాస్ నుండి ప్రేక్షకులు ఏమీ ఆశిస్తున్నారో అవన్నీ ఏమీ లేకుండానే సాగుతోంది.షో నిర్వాహకులు ఏమాత్రం సంతృప్తికరంగా లేరు.

కాని ఏమీ చేయలేక రేటింగ్‌ విషయంలో పట్టింపు లేకుండా వదిలేసి తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు.

Telugu Bb, Bigg Boss, Nagarjuna, Telugu-Movie

గతంలో ఎప్పుడు లేని విధంగా షో మొత్తం ఒకే విధంగా ఒకే ఫార్మట్ లో సాగుతోంది.ఆ ఫార్మట్‌ ప్రేక్షకులకు బోర్‌ కొట్టేసింది.ఏ మాత్రం ఆకట్టుకోని కథ మరియు కథనాల సినిమా ఎలా ఫెయిల్‌ అవుతుందో అలాగే ఈ షో కూడా అలాగే ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ వస్తున్నాయి.

రేటింగ్‌ పెంచడం కోసం నిర్వాహకులు ఏం చేయాలో అన్ని చేశారు కాని ప్రయోజనం లేదు.అందుకే చేతులు ఎత్తేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube